కుప్పకూలిన గ్రాఫైట్‌- పీసీ జ్యువెలర్స్‌

కుప్పకూలిన గ్రాఫైట్‌- పీసీ జ్యువెలర్స్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు విశ్లేషకుల అంచనాలను చేరకపోవడంతో ఓవైపు గ్రాఫైట్‌ ఎలక్ట్రొడ్స్‌ తయారీ దిగ్గజం గ్రాఫైట్‌ ఇండియా కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తగా.. మరోపక్క ఇదే కాలంలో పసిడి ఆభరణాల రిటైలింగ్‌ సంస్థ పీసీ జ్యువెలర్స్‌ పనితీరు నిరాశపరచడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లోనూ అమ్మకాలకు తెరతీశారు. ఫలితంగా ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో బోర్లా పడ్డాయి. ఇతర వివరాలు చూద్దాం.. 
 
గ్రాఫైట్‌ ఇండియా 
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో గ్రాఫైట్‌ ఇండియా నికర లాభం 113 శాతం ఎగసి రూ. 764 కోట్లను తాకింది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే ఇది 31 శాతం క్షీణతకాగా.. మొత్తం ఆదాయం సైతం 81 శాతం పెరిగి రూ. 1855 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి. క్యూ3లో నిర్వహణ(ఇబిటా) మార్జిన్లు 1 శాతం నీరసించి 62 శాతానికి పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో గ్రాఫైట్‌ ఇండియా షేరు ప్రస్తుతం 10 శాతం కుప్పకూలి రూ. 435 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 14 నెలల కనిష్టంకావడం గమనార్హం! కాగా.. గత రెండు రోజుల్లోనూ ఈ కౌంటర్ 6 శాతం వెనకడుగు వేసింది. 2019లో అయితే ఇప్పటివరకూ 42 శాతం దిగజారింది.

Image result for pc jewellers

పీసీ జ్యువెలర్స్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో పీసీ జ్యువెలర్స్‌ నికర లాభం 15 శాతం క్షీణించి రూ. 138 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం దాదాపు 20 శాతం తక్కువగా రూ. 2164 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో పీసీ జ్యువెలర్స్‌ షేరు ప్రస్తుతం 10.3 శాతం కుప్పకూలి రూ. 69 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 66.4 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. కంపెనీలో ప్రమోటర్లకు 57.59 శాతం వాటా ఉంది.Most Popular