యూరోప్‌ అప్‌- ఫార్మా, బ్యాంక్స్‌ డౌన్‌

యూరోప్‌ అప్‌- ఫార్మా, బ్యాంక్స్‌ డౌన్‌

ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తుండటంతో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతోనే కదులుతున్నాయి. మిడ్‌సెషన్‌ నుంచీ అమ్మకాలు మరింత పెరిగాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 238 పాయింట్లు క్షీణించి 36,308కు చేరింది. నిఫ్టీ సైతం 73 పాయింట్ల వెనకడుగుతో 10,871 వద్ద ట్రేడవుతోంది. ఉదయం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి వ్యక్తంకాగా.. ప్రస్తుతం యూరొపియన్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. జర్మనీ, యూకే, ఫ్రాన్స్‌ 0.6 శాతం చొప్పున ఎగశాయి. అయితే దేశీయంగా సెంటిమెంటు బలహీనంగా ఉండటంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఐటీ ఎదురీత
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ రంగాలు 1.6 శాతం చొప్పున తిరోగమించగా.. ఆటో, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ 1.2-0.7 శాతం మధ్య నష్టపోయాయి. మీడియా, ఐటీ 0,8-0.5 శాతం లాభాలతో ట్రెండ్‌కు ఎదురీదుతున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్‌ రెడ్డీస్ 6 శాతం పతనంకాగా.. ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, హిందాల్కో, గెయిల్‌, ఐబీ హౌసింగ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఆర్‌ఐఎల్‌, అల్ట్రాటెక్‌, ఎస్‌బీఐ 3.5-1.6 శాతం మధ్య వెనకడుగు వేశాయి. అయితే టాటా స్టీల్‌, సిప్లా, ఐషర్, టీసీఎస్‌, ఐవోసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, కొటక్‌ బ్యాంక్‌ 2-0.5 శాతం మధ్య బలపడ్డాయి.

డెరివేటివ్స్ ఇలా
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో అపోలో హాస్పిటల్స్‌, పీసీ జ్యువెలర్స్‌ 10 శాతం చొప్పున కుప్పకూలగా.. నాల్కో, సుజ్లాన్, ఐసీఐసీఐ ప్రు, అదానీ పవర్‌, అశోక్‌ లేలాండ్‌, రెప్కో హోమ్‌, స్టార్‌ 7-4.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క సన్‌ టీవీ 10 శాతం జంప్‌చేయగా, రిలయన్స్‌ కేపిటల్‌, బాలకృష్ణ, ఒరాకిల్‌, అజంతా ఫార్మా, మైండ్‌ట్రీ, కంకార్‌, ఆర్‌పవర్‌ 5-1.4 శాతం మధ్య ఎగశాయి. 

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్న నేపథ్యంలో చిన్న షేర్లలోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.5 శాతం చొప్పున బోర్లాపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1680 నష్టపోగా.. 717 మాత్రమే లాభాలతో ట్రేడవుతున్నాయి.Most Popular