మార్కెట్లోని ఈ కంపెనీ లోగోల వెనుక కథలు మీకు తెలుసా...?

మార్కెట్లోని ఈ కంపెనీ లోగోల వెనుక కథలు మీకు తెలుసా...?

ప్రతి కంపెనీకి, మార్కెట్లో తన ఉనికికై, లేదా కస్టమర్లు తేలికగా గుర్తుపట్టడానికి తమకంటూ ఒక లోగోను తయారు చేసుకుంటాయి. వీటి ద్వారా అవి తమ మార్కెట్ పరిధిని పెంచుకుంటాయి. మరొక ముఖ్యమైన విషయం ఎంటంటే ఆయా లోగోలు ఆ కంపెనీల గత చరిత్రను , తొలిఅడుగును ప్రతిబింబించేలా ఉంటాయి. ఈ గుర్తింపు చిహ్నాలే.. బ్రాండ్లుగా మారి  మార్కెట్లో దూసుకెళ్లడానికి దోహద పడతాయి. మరి ఇక్కడ కొన్ని కంపెనీల లోగోలను , వాటి చిహ్నాల వెనుక ఉన్న కథలేంటో చూద్దామా..!

Image result for amazon
అమెజాన్.కామ్: 
ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదిగిన సంస్థ అమెజాన్.కామ్. ఈ ఇ-కామర్స్ దిగ్గజం తన లోగోలో తన వ్యాపార ముఖ్య ఉద్దేశ్యాన్ని చెప్పాలని భావించింది. అందుకు అనుగుణంగానే తన లోగోలో ఎల్లో లైన్ ద్వారా చిరునవ్వును ప్రతిబింబించేలా డిజైన్‌ చేసింది. కస్టమర్ల సంతోషపు చిరునవ్వే తమ లక్ష్యమని, అలాగే.. అమెజాన్ లెటర్స్ లోని A నుండి Z వరకూ కింద అండర్ లైన్ చేసిన ఎల్లో గీత వంపు ద్వారా.. ఏ టు జడ్ ., ఏదైనా సరే ఆన్‌లైన్‌లో మీకందిస్తామని చెప్పడం కోసం ఇలా డిజైన్‌ను రూపొందించింది.

 Image result for cisco system
సిస్కో సిస్టమ్స్ : (CISCO)
కంపెనీ మాజీ CEO జాన్ మార్‌గ్రిడ్జ్  తమ కంపెనీకి ఒక మంచి లోగో కావాలని యోచించారు. అందుకు అనుగుణంగా లోగో ఎలా తయారు చేయాలా అని ఆలోచిస్తూ.. సిస్కో సిస్టమ్స్ కంపెనీ రిజిస్టేషన్‌ కొరకు శాక్రమెంటో నగరానికి బయలు దేరారు. ఇదే సమయంలో ఉదయపు సూర్యుడి కాంతిలో మెరుస్తున్న గోల్డెన్ గేట్ వంతెన మీదుగా వెళ్తూ.. ఆ బ్రిడ్స్ సౌందర్యానికి ముగ్ధులయ్యారు. ఆ గోల్డెన్ గేట్ వంతెన ఆకాశంలో సగర్వంగా నిలబడ్డట్టుగా ఉండటంతో తమ కంపెనీ కూడా.. మార్కెట్లో సగర్వంగా నిలబడాలన్న యోచనతో  గోల్డెన్ గేట్ వంతెన నే చిహ్నంగా తమ కంపెనీ లెటర్స్ పైన ముద్రించారు. సిస్కో అక్షరాల పైన కనబడే గీతలే గోల్డెన్ గేట్ వంతెనను ప్రతిబింబిస్తాయి. 

Image result for google logo
గూగుల్.కామ్ : (GOOGLE)
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ తమ కంపెనీ పోకడలను, తమ వ్యాపారాన్ని ప్రతిబింబించేలా తమ లోగోను డిజైన్‌ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ లోగోను గుర్తించని వారుండరంటే.. అతిశయోక్తి కాదు. అంతగా ప్రాచుర్యం పొందింది ఈ గూగుల్ లోగో. ఈ లోగోలోని కలర్స్ అన్నీ ప్రైమరీ కలర్స్ గానే ఉండగా, ఒక్క L లెటర్‌ను మాత్రం గ్రీన్ కలర్‌లో ఉంటుంది. ఈలోగో రూపకర్త రూత్ కెడార్ దీనిపై మాట్లాడుతూ.. "ఆ ఒక్క L లెటర్ రంగును నాన్ ప్రైమరీ కలర్‌గా ఎంచుకోవడంలో ఉద్దేశ్యం ఎంటంటే.. మేం రూల్స్ పాటించం" అని చెప్పడానికే అని పేర్కొన్నారు. గూగుల్ నియమాలను పాటించదని, నియమాలను తయారు చేస్తుందని చెప్పడమే ప్రధాన ఉద్దేశ్యం అంటున్నారు గూగల్ వర్గాలు.

Image result for mercedes benz logo
మెర్సిడిస్ బెంజ్ : (Mercedes Benz)
ప్రముఖ విలాస వంతమైన కార్ల తయారీ దిగ్గజం మెర్సిడిస్ బెంజ్ తన లోగోను ఐకానిక్ ట్రైస్టార్‌గా రూపోందించింది. బెంజ్ ఫౌండర్ , DMG గ్రూప్ అధినేత గోట్లిబ్ దెమ్లర్ తన కుమారులకు రాసిన ఒక ఉత్తరంపై ఈ చిహ్నాన్ని గీశాడు. ఈ మూడు నక్షత్రాలు భూమి, ఆకాశం, నీరు ను సూచిస్తాయి. తన వ్యాపారం ఈ మూడింటి మీద సాగాలని ఆయన ఆకాంక్షించారని బెంజ్ కంపెనీ వర్గాలు అంటుంటాయి. 1926లో బెంజ్ , సై (CIE) కంపెనీల విలీనం తరువాత ఈ బెంజ్ లోగో ప్రపంచ వ్యాప్తంగా ఒక బ్రాండ్ ఐకాన్‌గా ప్రసిధ్ధి చెందింది. 

Image result for dominos pizza logo
డోమినోస్ పిజ్జా: 
పిజ్జా , బర్గర్‌ల వ్యాపార దిగ్గజం డొమినోస్  ఫౌండర్ టామ్ మోనఘన్  తొలుత తన వ్యాపారానికి ఎం పేరు పెడదామా అని ఆలోచించారు.1960లో తన పిజ్జా సెంటర్లు మూడు చోట్ల ప్రారంభం అయ్యాక , తన కంపెనీ ఉద్యోగి ఒకరు పిజ్జా డెలివరీ చేశాక, మన కంపెనీ పేరు "డోమినోస్ " అంటూ అరిచాడు. దీంతో టామ్ తన కంపెనీ పేరు, మరియు తనకున్న 3 అవుట్‌లెట్ల చిహ్నంగా 3 చుక్కలతో డిజైన్‌ను తయారు చేయించాడు. తన అవుట్ లెట్లు పెరిగిన కొద్దీ లోగోలోని చుక్కలను కూడా పెంచుదామనుకున్నాడు . కానీ.. అదే మూడు బ్రాంచ్‌లు కలిగిన ఓ చిన్న కంపెనీ నేడు ప్రపంచ వ్యాప్తంగా అవుట్ లెట్స్ తో విస్తరిస్తుందని ఆయన అప్పుడు ఊహించి ఉండడు. 

Image result for audi cars logo
ఆడీ : (AUDI cars):
1909 లో ఆగస్ట్ హార్చ్ ఆడీ కంపెనీని స్థాపించారు. అంతకు ముందు సరిగ్గా 10 సంవత్సరాల క్రితం హార్చ్ అనే కంపెనీకి ఓనర్‌గా ఉండేవారు ఆగస్ట్ హార్చ్. కార్ల తయారీ, విడిభాగాల ఉత్పత్తులు తయారు చేసేవారు. ఆ తరువాత జర్మనీలో  పురాతన కార్ల కంపెనీలైన  ఆడీ, హర్చ్, DKW, వాండరర్ కంపెనీలను విలీనం చేసి వీటికి గుర్తుగా నాలుగు చక్రాలను ఒకదానిలో ఒకటి పెనవేసుకున్నట్టుగా లోగోను తయారు చేశారు.  ఈ చిహ్నం ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులకు ఒక బ్రాండ్ ఎసెట్‌గా నిలిచిపోయింది. 

Image result for adidas logo
ఆడిడాస్ : (ADIDAS ) 
ప్రముఖ స్పోర్ట్స్ షూ, స్పోర్ట్స్ ఉపకరణాల తయారీ సంస్థ ఆడిడాస్. భారతీయ సంతతికి చెందిన ఈ కంపెనీ తన లోగోను మూడు సార్లు మార్చింది. కానీ.. ఈ మూడు సార్లు కూడా లోగోలోని మూడు చారలను మాత్రం మార్చలేదు.  ప్రస్తుతం ఉన్న లోగోలోని ఈ చారలు పర్వతాన్ని సూచిస్తాయి. సవాళ్ళను తోసిపుచ్చుతూ.. శిఖరాన్ని అధిరోహించేవారే తమ కస్టమర్లు అన్న భావనతో ఈ లోగోను వారు తయారు చేశారు. ప్రజలు తమ పరిమితులను దాటి మరీ ఎదగాలన్నది తమ ఆకాంక్ష అని అడిడాస్ పేర్కొంది. 

Image result for dell logo
డెల్ కంప్యూటర్స్ : (DELL)
కంప్యూటర్ల వ్యాపార దిగ్గజం డెల్ కంప్యూటర్స్ తన లోగోను విభిన్నంగా రూపొందించింది. లోగోలోని అక్షరాల్లో E అనే అక్షరం కాస్త వంపు తిరగి ఉండటం మనం గమనిస్తాం. సునిశిత హాస్యం, వ్యాపారంలో దూకుడు తనానికి చిహ్నంగా ఈ  అక్షరాన్ని కాస్త వంపు తిప్పారు.  పర్సనల్ కంప్యూటర్ రంగంలో తమ ఆధిక్యాన్ని నిలుపుకోవాలన్న ఆకాంక్ష ఈ లోగో ద్వారా వారు గట్టిగా చెప్పడానికి ప్రయత్నించారు కంపెనీ వ్యవస్థాపకులు మైఖెల్ సౌల్ డెల్ .

 Image result for baskin robbins logo
బాస్కిన్ రాబిన్స్ (ఐస్ క్రీం)
డంకిన్ బ్రాండ్స్ కు చెందిన బాస్కిన్ రాబిన్స్ లోగో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ దిగ్గజ ఐస్‌క్రీం తయారీ సంస్థ తన లోగోలో BR మధ్యన 31 అంకెను పింక్ కలర్‌లో పొందు పరిచింది. దీని వెనుక తమ కంపెనీలో 31 రకాల ఐస్ క్రీం ఫేవర్లు ఉన్నాయని.. కస్టమర్లకు నెల పొడుగునా.. రోజుకో కొత్త రకం ఐస్‌క్రీం రుచులను అందిస్తామని చెప్పడమే ప్రధాన ఉద్దేశ్యమని కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్ కారల్‌ ఆస్టిన్ అంటున్నారు.  


 Most Popular