మీర్జా- క్యూ3 షాక్‌- పీఎస్‌పీ ఓకే

మీర్జా- క్యూ3 షాక్‌- పీఎస్‌పీ ఓకే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఓవైపు లెదర్‌ ఫుట్‌వేర్‌ ప్రొడక్టుల సంస్థ మీర్జా ఇంటర్నేషనల్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క ఇదే కాలంలో ప్రోత్సాహకర పనితీరును ప్రదర్శించిన నేపథ్యంలో నిర్మాణ రంగ సంస్థ పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఇతర వివరాలు చూద్దాం.. 

మీర్జా ఇంటర్నేషనల్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో  మీర్జా ఇంటర్నేషనల్‌ నికర లాభం 64 శాతం పడిపోయి రూ. 7.5 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 21 శాతం పెరిగి రూ. 307 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 36 శాతం బలహీనపడి రూ. 29.5 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 18.1 శాతం నుంచి 9.6 శాతానికి నీరసించాయి. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో మీర్జా ఇంటర్నేషనల్‌ షేరు ప్రస్తుతం 12 శాతం కుప్పకూలి రూ. 61 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 57 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది.

Image result for psp project ltd

పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌ నికర లాభం 43 శాతం పుంజుకుని రూ. 21.5 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 53 శాతం పెరిగి రూ. 261 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 33 శాతం బలపడి రూ. 36 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు మాత్రం 15.8 శాతం నుంచి 13.8 శాతానికి బలహీనపడ్డాఆయి. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌ షేరు ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 396 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 407 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. Most Popular