ఫార్మా, మెటల్‌ పతనం- ఐటీ ప్లస్‌

ఫార్మా, మెటల్‌ పతనం- ఐటీ ప్లస్‌

వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 177 పాయింట్లు క్షీణించి 36,369కు చేరింది. నిఫ్టీ సైతం 67 పాయింట్ల వెనకడుగుతో 10,877 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం అమెరికా మార్కెట్లు ఫ్లాట్‌గా ముగియగా..  యూరొపియన్‌ మార్కెట్లు వెనకడుగు వేశాయి. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. అయితే దేశీయంగా సెంటిమెంటు బలహీనంగా ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Image result for steel making

రియల్టీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా, మెటల్‌ రంగాలు 2 శాతం చొప్పున తిరోగమించగా.. రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ 1.5-0.7 శాతం మధ్య నష్టపోయాయి. ఐటీ మాత్రమే 0.5 శాతం లాభంతో నష్టాలకు ఎదురీదుతోంది. ఫార్మా కౌంటర్లలో డాక్టర్‌ రెడ్డీస్, పిరమల్‌, సన్‌ ఫార్మా, గ్లెన్‌మార్క్‌, లుపిన్‌, దివీస్‌, అరబిందో 6-1.5 శాతం మధ్య పతనమయ్యాయి. రియల్టీ స్టాక్స్‌లో బ్రిగేడ్‌, యూనిటెక్‌, ఇండియాబుల్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, శోభా, సన్‌టెక్, ప్రెస్టేజ్‌, డీఎల్‌ఎఫ్‌ 6-1 శాతం మధ్య బోర్లాపడ్డాయి. ఇక మెటల్‌ కౌంటర్లలో నాల్కో, వెల్‌స్పన్‌, హిందాల్కో, జిందాల్‌, వేదాంతా, ఎంవొఐఎల్‌, హింద్‌ కాపర్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సెయిల్‌ 8-1.25 శాతం మధ్య దిగజారాయి. 

Image result for real estate images

ఇతర బ్లూచిప్స్‌లో
నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, గెయిల్‌, అదానీ పోర్ట్స్‌, ఐబీ హౌసింగ్‌, అల్ట్రాటెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 3.5-2.25 శాతం మధ్య క్షీణించాయి. అయితే సిప్లా, టీసీఎస్, ఇన్ఫోసిస్‌, ఐషర్, హీరో మోటో, ఐటీసీ 1.4-0.4 శాతం మధ్య బలపడ్డాయి. కాగా.. ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో పీసీ జ్యువెలర్స్‌, సుజ్లాన్, అపోలో హాస్పిటల్స్‌, జీఎంఆర్‌, జైన్‌ ఇరిగేషన్, అదానీ ఎంటర్‌, మెక్‌డోవెల్‌, అదానీ పవర్‌ 10-5 శాతం మధ్య కుప్పకూలాయి. మరోపక్క
డెరివేటివ్స్‌లో సన్‌ టీవీ 8 శాతం జంప్‌చేయగా, రిలయన్స్‌ కేపిటల్‌, బాలకృష్ణ, మైండ్‌ట్రీ, కంకార్‌, డిష్‌ టీవీ, ఒరాకిల్‌, ఆర్‌పవర్‌ 3-1 శాతం మధ్య బలపడ్డాయి. 

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్న నేపథ్యంలో చిన్న షేర్లలోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.3 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1520 నష్టపోగా.. 610 మాత్రమే లాభాలతో ట్రేడవుతున్నాయి.Most Popular