విశాకా- అపోలో హాస్పిటల్స్‌ డీలా

విశాకా- అపోలో హాస్పిటల్స్‌ డీలా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఓవైపు బిల్డింగ్‌ ప్రొడక్టుల సంస్థ విశాకా ఇండస్ట్రీస్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క ఇదే కాలంలో ప్రోత్సాహకర పనితీరును ప్రదర్శించినప్పటికీ హెల్త్‌కేర్ సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్ల అమ్మకాలతో కళతప్పింది. ఇతర వివరాలు చూద్దాం.. 

విశాకా ఇండస్ట్రీస్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో విశాకా ఇండస్ట్రీస్‌ నికర లాభం 36 శాతం పడిపోయి రూ. 9 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం నామమాత్ర క్షీణతతో రూ. 240 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 29 శాతం బలహీనపడి రూ. 24 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 14.2 శాతం నుంచి 10.1 శాతానికి నీరసించాయి. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో విశాకా ఇండస్ట్రీస్‌ షేరు ప్రస్తుతం 7 శాతం పతనమై రూ. 339 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 330 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది.

Image result for apollo hospitals

అపోలో హాస్పిటల్స్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో అపోలో హాస్పిటల్స్‌ నికర లాభం 29 శాతం పుంజుకుని రూ. 87 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం పెరిగి రూ. 2169 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 29 శాతం బలపడి రూ. 268 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 11.9 శాతం నుంచి 12.3 శాతానికి ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో అపోలో హాస్పిటల్స్‌  షేరు ప్రస్తుతం 5 శాతం పతనమై రూ. 1196 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1300 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.Most Popular