వా టెక్‌- థైరోకేర్‌- ఫలితాల ఫీవర్

వా టెక్‌- థైరోకేర్‌- ఫలితాల ఫీవర్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఓవైపు ఇంజినీరింగ్‌ దిగ్గజం వా టెక్‌ వాబాగ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క ఇదే కాలంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో హెల్త్‌కేర్ సేవల సంస్థ థైరోకేర్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్ల అమ్మకాలతో కళతప్పింది. ఇతర వివరాలు చూద్దాం.. 

వా టెక్‌ వాబాగ్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో వా టెక్‌ వాబాగ్‌ నికర లాభం 49 శాతం పడిపోయి రూ. 15 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 24 శాతం క్షీణించి రూ. 662 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 36 శాతం బలహీనపడి రూ. 49 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 9 శాతం నుంచి 7.4 శాతానికి నీరసించాయి. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో వా టెక్‌ షేరు ప్రస్తుతం 5 శాతం పతనమై రూ. 275 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 261 దిగువకు జారింది.

Image result for thyrocare technologies

థైరోకేర్‌ టెక్నాలజీస్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో థైరోకేర్‌ టెక్నాలజీస్‌ నికర లాభం 6 శాతం క్షీణించి రూ. 20 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 15 శాతం పుంజుకుని రూ. 96 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) నామమాత్రంగా బలపడి రూ. 35 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 42.2 శాతం నుంచి 36.9 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 8 శాతం పతనమై రూ. 504 వ్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 502 వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది. 



Most Popular