బాలకృష్ణ- సన్‌ టీవీ- జూమ్‌

బాలకృష్ణ- సన్‌ టీవీ-  జూమ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో సాధించిన ఫలితాల నేపథ్యంలో ఓవైపు మీడియా దిగ్గజం సన్‌ టీవీ కౌంటర్‌ జోరందుకోగా.. మరోపక్క ఫలితాలు కొంతమేర నిరాశపరచినప్పటికీ కార్బన్‌బ్లాక్‌ యూనిట్‌ ఏర్పాటు కారణంగా ఆఫ్‌రోడ్‌ టైర్ల తయారీ దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఈ రెండు కౌంటర్లలోనూ కొనుగోళ్లు నమోదవుతుండటంతో నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. 

బాలకృష్ణ ఇండస్ట్రీస్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ నికర లాభం 24 శాతం క్షీణించి రూ. 145 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 9 శాతం పుంజుకుని రూ. 1206 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 4 శాతం బలపడి రూ. 301 కోట్లకు చేరింది. కాగా.. మార్చికల్లా 60,000 మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న కార్బన్‌బ్లాక్‌ యూనిట్‌ తొలి దశ అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో తొలుత ఎన్‌ఎస్‌ఈలో బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ షేరు 2 శాతం క్షీణించి రూ. 744 వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది. తదుపరి జోరందుకుంది. ప్రస్తుతం 4 శాతం జంప్‌చేసి రూ. 788 వద్ద ట్రేడవుతోంది. 

Image result for sun tv network
సన్‌ టీవీ నెట్‌వర్క్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో సన్‌ టీవీ నెట్‌వర్క్‌ నికర లాభం 32 శాతం ఎగసి రూ. 351 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 32 శాతం పుంజుకుని రూ. 904 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 36 శాతం బలపడి రూ. 667 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో సన్‌ టీవీ నెట్‌వర్క్‌ షేరు ప్రస్తుతం 4.5 శాతం జంప్‌చేసి రూ. 545 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 556 వరకూ దూసుకెళ్లింది.Most Popular