నష్టాలతో- ఆటో డీలా- అడాగ్‌ అప్‌

నష్టాలతో- ఆటో డీలా- అడాగ్‌ అప్‌

పలు ప్రతికూల అంశాల నేపథ్యలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 174 పాయింట్లు తిరోగమించి 36,372 వద్ద కదులుతోంది. నిఫ్టీ సైతం 54 పాయింట్ల వెనకడుగుతో 10,890 వద్ద ట్రేడవుతోంది. గత వారం ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌ భారీ నష్టాలు ప్రకటించడం, తాజాగా మహీంద్రా అండ్‌ మహీంద్రా ట్రాక్టర్ల అమ్మకాలు మందగిస్తున్నట్లు అంచనా వేయడంతో ఆటో రంగ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఆటో 1.3 శాతం నష్టపోగా.. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, రియల్టీ, బ్యాంక్స్‌ 1-0.5 శాతం మధ్య క్షీణించాయి. శుక్రవారం అమెరికా ఫ్లాట్‌గా ముగిస్తే, యూరొపియన్‌ మార్కెట్లు వెనకడుగు వేశాయి. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. 

ఐటీ ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో మీడియా, ఐటీ రంగాలు 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. బ్లూచిప్స్‌లో ఐబీ హౌసింగ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ, గెయిల్‌, గ్రాసిమ్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌పీసీఎల్‌, ఐషర్‌, ఐవోసీ 3-1.5 శాతం మధ్య క్షీణించాయి. అయితే టాటా స్టీల్‌, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జీ, ఇన్ఫోసిస్‌ 2-0.5 శాతం మధ్య బలపడ్డాయి.

Image result for anil ambani

అనిల్‌ షేర్లు జూమ్‌
డెరివేటివ్స్‌లో నాల్కో, పీసీ జ్యువెలర్స్‌, ఉజ్జీవన్‌, జీఎంఆర్‌, దివాన్‌ హౌసింగ్‌, జేపీ, మెక్‌డోవెల్‌ 5-3 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క సన్‌ టీవీ, బాలకృష్ణ, రిలయన్స్‌ కేపిటల్‌, ఆర్‌పవర్, ఐజీఎల్‌, గ్లెన్‌మార్క్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, మైండ్‌ట్రీ 4.5-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి.

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్న నేపథ్యంలో చిన్న షేర్లలోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.7-1 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 869 నష్టపోగా.. 419 మాత్రమే లాభాలతో ట్రేడవుతున్నాయి.Most Popular