మీ పెట్టుబడులు ఏ విధంగా ఉంటున్నాయి? ఇలా చేస్తే.. మీకు లాభాల పంటే..!

మీ పెట్టుబడులు ఏ విధంగా ఉంటున్నాయి? ఇలా చేస్తే.. మీకు లాభాల పంటే..!

చాలామంది ప్రజలకు, పెట్టుబడులు, భీమా కొనుగోలు లేదా రుణాలు తీసుకోవడం అనే ఆర్థిక నిర్ణయాలు అనిశ్చితంగా కనిపిస్తాయి. ఏదైనా ఒక స్టాక్‌లో పెట్టుబడులు పెట్టడానికి సరైన నిర్ణయాలు, సరైన విచారణను చాలా మంది చేయరు. గుడ్డిగా పెట్టుబడి పెట్టడమో..లేక ఎవరైనా చెప్పారనో వారు తమ పెట్టుబడులను పెడ్తారు. అలా కాకుండా సరైన విచారణ, విషయ పరిగ్రహణ చేసి ఆయా రంగాల్లో పెట్టుబడులు పెడితే.. మంచి రిటర్న్స్ ను సాధించవచ్చంటున్నారు గ్లోబల్ ఎనలిస్టులు. వేర్వేరు రంగాల్లో తమ పెట్టుబడులను పెట్టేవారు దీర్ఘకాలంలో స్థిరంగా గరిష్ట లాభాలను స్వీకరించగలుగుతారని వారు పేర్కొంటున్నారు. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్  మార్కెట్ నిపుణులు మదుపర్లకు పలు సూచనలు చేస్తున్నారు. అవేంటో చూద్దాం.
మ్యూచువల్ ఫండ్స్ :
చాలా మంది మదుపర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి అయోమయంగా ఫీల్ అవుతుంటారు. తమ పెట్టుబడులను ఎలా విభజించి పెట్టుబడిగా పెట్టాలో తెలియక తికమక పడుతుంటారు. ఇక్కడ నిపుణులు చెప్తున్న మాటేంటంటే.. మీ పెట్టుబడులను 4:3:1 రేషియోలో విభజించండి. ఈక్విటీల మీద 4 , ఆర్ధిక రంగాల్లో(రుణాలు) 3, లిక్విడ్ ఫండ్స్ మీద 1  , చొప్పున రేషియోను పాటించండి. ఆ తరువాత క్రమంగా ఈ నిష్పత్తిని 6:3:1 గా మార్చుకోండి. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా చాలా వాటిలో పెట్టుబడులు పెట్టడం కంటే.. 3 లేదా 4 మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకోమని నిపుణులు సలహా ఇస్తున్నారు. 
స్టాక్స్ (ఈక్విటీస్ ) 
మ్యూచువల్ ఫండ్స్ లాగా మీకు పెద్ద పోర్ట్ ఫోలియో అక్కర్లేదు. స్టాక్స్ ఎంపిక సమయంలో ఆయా కంపెనీల బుక్ వాల్యూ.. ఫేస్ వాల్యూ పరిగణనలోకి తీసుకుని పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు ఎనలిస్టులు. మీ బడ్జెట్ 2 నుండి 5 లక్షల లోపు ఉన్నట్టైతే.. మీరు 8-10 స్టాక్స్ వరకే ఎంపిక చేసుకోండి. మరి కొందరు ఎనలిస్టుల సలహా ఎంటంటే.. రూ.5 లక్షల లోపు పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. మంచి స్టాక్స్ అనుకున్నవి నాలిగింటిలోనే ఇన్వెస్ట్ చేయమని పేర్కొంటున్నారు.
ULIPs: (యులిప్ పథకాలు )
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (ULIPs) అనేవి క్రమంగా మదుపర్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా శాలరీ ఉద్యోగులకు ఈ పాలసీలు అనువుగా ఉన్నాయనే చెప్పొచ్చు. వీటిలో ట్యాక్స్ రాయితీలు, ఈక్విటీలకు సమానంగా రిటర్న్స్, అతి తక్కువ ఛార్జీలు ఉండటంతో వీటివైపు ఎగువ స్థాయి, మధ్య స్థాయి ఉద్యోగులు ఆకర్షితులవుతున్నారు. మీకు నిర్ధిష్ట ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలన్నా, లేక రిటైర్‌మెంట్ తరువాత స్థిర అధిక ఆదాయం కావాలనుకున్నా, కొన్ని సంవత్సరాల తరువాత (దీర్ఘకాలిక) నిర్ధిష్ట లక్ష్యాలు ఉన్నప్పుడు ఈ యూలిప్స్ తీసుకోవడం మేలని ఎనలిస్టులు సూచిస్తున్నారు. 
Disclaimer: పైన పేర్కొన్న సూచనలు, అభిప్రాయాలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు, మార్కెట్ నిపుణులు ఇచ్చినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి. Most Popular