అమ్మకాల ఒత్తిళ్ళు..! 10-60 శాతం పడిన ఈ 16 స్టాక్స్ !!

అమ్మకాల ఒత్తిళ్ళు..! 10-60 శాతం పడిన ఈ 16 స్టాక్స్ !!

గురువారం నాటి మార్కెట్లలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రికార్డు స్థాయిలో ఎగబాకాయి. సన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పైన నమోదు కావడంతో మదుపర్ల ఆశలకు రెక్కలొచ్చాయి. కానీ.. గత  రెండు ట్రేడింగ్ సెషన్లలో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది.  పలు కౌంటర్లలో అమ్మకాల ఒత్తిళ్ళు ఎదురవ్వడంతో మార్కెట్ సూచీలు నేల చూపులు చూశాయి. వారం చివరి రోజైన శుక్రవారం నాటికి BSE సెన్సెక్స్ 37,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా తన 11,000 గరిష్ట మార్కును నిలుపుకోలేక పోయింది. 
 వీక్లీ బేసిస్‌లో సెన్సెక్స్ 0.2 శాతం పెరగగా,  నిఫ్టీ 0.46శాతం  పెరిగింది. కానీ.. అమ్మకాలు ఎక్కువగా జరగడంతో దాదాపు  BSE 500 లోని ఓ 16 స్టాక్స్ దారుణంగా నష్టపోయాయి. సుమారు 10శాతం నుండి 60 శాతం వరకూ నష్టపోయాయి ఈ 16 స్టాక్స్. డబుల్ డిజిట్‌ కోతతో నష్టపోయిన వాటిలో రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్, రిలయన్స్ కమ్యునికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, సుజ్లాన్ ఎనర్జీ, జయప్రకాష్ అసోసియేట్స్, ఆదానీ పవర్, SREI ఇన్ఫ్రా, IDBI బ్యాంక్, సెంట్రమ్ క్యాపిటల్, ఇండియా బుల్స్ వెంచర్స్, ఇండియా బుల్స్ ఇంటిగ్రెటెడ్ సర్వీసెస్, టాటా కెమికల్స్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్,  మహీంద్రా లాజిస్టిక్స్ వంటివి ఉన్నాయి. 

unnamed (1)
ముగిసిన ఫిబ్రవరి తొలి వారం నాటికి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు దాదాపు 2శాతం క్షీణించాయి. BSEలోని దాదాపు 300 స్టాక్స్ తమ 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. BSE లోని ఓ 21 స్టాక్స్ తమ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయాయి. వీటిలో రిలయన్స్ కమ్యునికేషన్స్, రిలయన్స్ పవర్, సుజ్లాన్, ఐనాక్స్, ICICI సెక్యూరిటీస్, కొచ్చిన్ షిప్ యార్డ్, కోల్ ఇండియా, శంకర బిల్డింగ్స్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి తమ స్టాక్స్ ప్రస్థానంలో ఇంతవరకూ చూడని క్షీణతను చవిచూశాయి. 
అనిల్ అంబానీకి చెందిన అడాగ్ షేర్లు తమ జీవిత కాల కనిష్టానికి పడిపోయాయి. ఎడిల్వీజ్, L&T సంస్థలు చట్టవిరుద్ధంగా తనఖాలో ఉన్న తమ స్టాక్స్ ను విక్రయించాయని , అదే ఈ పరిస్థితికి మూల కారణమని అనిల్ అంబానీ సెబీకి ఆరోపించారు. షేర్ల ధరలు ఇంతగా పతనం కావడానికి ఈ రెండు కంపెనీలే కారణమని రిలయన్స్ భావిస్తొంది.

Image result for anil ambaniImage result for L&T, edelweiss logosImage result for L&T

రిలయన్స్ ఆరోపణలపై L&T, ఎడిల్వీజ్ సంస్థలు స్పందిస్తూ.. తాము చట్టబద్ధంగానే ఆయా షేర్లను విక్రయించామని, రుణదాతలుగా మేము రుణాలిచ్చి, స్టాక్స్ విక్రయించకుండా ఇంకా నష్టపోవాలా అంటూ అవి ప్రశ్నించాయి. రిలయన్స్ షేర్ల విక్రయాలకు సంబంధించి సెబీకి అన్ని వివరాలను సమర్పిస్తామని ఎడిల్వీజ్ పేర్కొంది. రిలయన్స్ దివాళ ప్రక్రియ ప్రారంభించనున్నట్టు పేర్కొన్న రోజునుండే అడాగ్ షేర్లలో క్షీణత మొదలైంది. దాదాపు రూ. 18,000 కోట్ల సంపద ఆవిరైంది.
రానున్న వారంలో నిఫ్టీ  కీ సపోర్ట్ జోన్ 10,980 -11,000 పాయింట్ల మధ్య ఉండొచ్చని, షార్ట్ టర్మ్ కోణంలో చూస్తే.. నిఫ్టీ  కీ టార్గెట్ 10,583-10,534 గా ఉండొచ్చని ఎనలిస్టులు పేర్కొంటున్నారు.  
 Most Popular