టాటా స్టీల్ Q-3 ఫలితాలు..!

టాటా స్టీల్ Q-3 ఫలితాలు..!

టాటా స్టీల్ తన డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. మార్కెట్ బ్రోకింగ్ సంస్థల అంచనాలకు చేరుకోకపోయినా.. నెట్ రెవెన్యూ రూ. 41,219.9 కోట్లు సాధించింది. గత సంవత్సరం ఇది రూ. 33,446 కోట్లుగా ఉంది(YoY) , EBITDA మార్జిన్లు 16.3శాతం పెరిగాయి. ఎబిటిడా 18శాతం పెరిగి రూ. 6,717.4 కోట్లుగా ఉంది.  నెట్ ఫ్రాఫిట్ రూ. 2,284.1 కోట్లుగా పేర్కొంది టాటా స్టీల్.  యూరోప్ బిజినెస్ రెవిన్యూ 7.9శాతం పెరిగి రూ. 15,850.5 కోట్ల రెవెన్యూను చూపించింది.  ఇండియన్ రెవిన్యూ 10శాతం పెరుగుదలతో రూ. 17,173 కోట్లుగా చూపించింది.  ఇండియాలో కాకుండా మిగతా దేశాల్లో నుండి వచ్చిన రెవెన్యూ రూ. 202.14 కోట్లుగా పేర్కొంది. గత సంవత్సరం గ్లోబల్ మార్కెట్లలో మెటల్ రంగం పూర్తిగా నిరాశాజనకంగా ఉండటంతో ప్రాఫిట్ మార్జిన్లు తగ్గాయని టాటా స్టీల్ పేర్కొంది. దేశీయంగా ఇన్ఫ్రా రంగం పూర్తిగా డౌన్‌ కావడంతో పలు ప్రాజెక్టులు రద్దైనట్టు కంపెనీ తెలిపింది. 

కన్సాలిడేటెడ్ స్టీల్ ఉత్పత్తి 11శాతం పెరిగి 7.23 మిలియన్ టన్నులుగా పేర్కొంది. స్టీల్ డెలివరీ కూడా 7శాతం పెరిగి 6.99 మిలియన్ టన్నులుగా ఉంది.ఈ డిసెంబర్ క్వార్టర్‌ నాటికి రుణ భారం రూ. 9,083 కోట్లుగా ఉందని టాటా స్టీల్ పేర్కొంది. టాటా స్పాంజ్ ఐరన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉషా మార్టిన్ స్టీల్ వ్యాపారాన్ని రానున్న క్వార్టర్‌ కల్లా మూసివేయనున్నట్టు కంపెనీ తెలిపింది. Most Popular