క్యూ3 దెబ్బ- వీఐపీ- ఆర్‌ఈసీ

క్యూ3 దెబ్బ- వీఐపీ- ఆర్‌ఈసీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఓవైపు లగేజీ, ట్రావెల్‌ ప్రొడక్టుల దిగ్గజం వీఐపీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క ఇదే కాలంలో ఆర్జించిన నికర లాభం విశ్లేషకుల అంచనాలను చేరకపోవడంతో విద్యుత్‌ రంగ పీఎస్‌యూ సంస్థ ఆర్‌ఈసీ లిమిటెడ్‌ కౌంటర్‌కూ అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. ఇన్వెస్టర్లు ఈ రెండు కౌంటర్లలోనూ అమ్మకాలకు ఎగబడటంతో నష్టాలతో కళతప్పాయి. ఇతర వివరాలు చూద్దాం.. 

వీఐపీ ఇండస్ట్రీస్‌   
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో వీఐపీ ఇండస్ట్రీస్‌ నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 24 కోట్లకు పరిమితమైంది. ఇక మొత్తం ఆదాయం మాత్రం 27 శాతం పెరిగి రూ. 430 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 8 శాతం తక్కువగా రూ. 38 కోట్లకు చేరింది. మార్జిన్లు 12.2 శాతం నుంచి 8.8 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం వీఐపీ ఇండస్ట్రీస్‌ షేరు 4.4 శాతం పతనమైంది. 491 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 480 వద్ద కనిష్టాన్ని తాకింది.

Image result for REC ltd

ఆర్‌ఈసీ లిమిటెడ్‌  
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఆర్‌ఈసీ లిమిటెడ్‌ నికర లాభం 16 శాతం పెరిగి రూ. 1275 కోట్లకు చేరింది. ఇక మొత్తం ఆదాయం సైతం 13 శాతం పుంజుకుని రూ. 2542 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఆర్‌ఈసీ లిమిటెడ్‌ షేరు 5 శాతం పతనమైంది. 119 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 118 వద్ద కనిష్టాన్ని తాకింది.Most Popular