Q-3 ఫలితాల ద్వారా ఈ 10 స్టాక్స్‌ రేటింగ్స్ పెరిగాయ్!! మరి మీ దగ్గరున్నాయా?

Q-3 ఫలితాల ద్వారా ఈ 10 స్టాక్స్‌ రేటింగ్స్ పెరిగాయ్!! మరి మీ దగ్గరున్నాయా?

దేశీయ మార్కెట్లలో కంపెనీల గత డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు మిశ్రమంగానే వచ్చాయి. నిఫ్టీలోని 34 కంపెనీలు తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించాయి.వీటిలో సుమారు 25 కంపెనీలు బ్రోకింగ్ సంస్థల అంచనాలను అందుకున్నాయి. మారుతీ సుజుకీ, అల్ట్రా టెక్ సిమెంట్, ఎస్ బ్యాంక్, SBI, IOC, భారతీ ఎయిర్ టెల్ , NTPC వంటి కంపెనీలు తమ క్వార్టర్ ఫలితాలను అంచనాల మేరకు ప్రకటించలేక పోయాయి. ఇదే సమయంలో L&T , యాక్సిస్ బ్యాంక్‌, ITC, ఏషియన్ పెయింట్స్,  బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, HCL వంటివి అంచనాలకు మించి రాణించాయి. ఈ నేపథ్యంలో పలు గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు ఓ 10 స్టాక్స్ టార్గెట్ ప్రైస్‌ను పెంచాయి. రానున్న  కొద్ది నెలల్లో ఈ స్టాక్స్ మంచి లాభాలను తీసుకొస్తాయని వాటి అంచనా. అవేంటో చూద్దామా?

IGL:  డాయిష్ బ్యాంక్  రేటింగ్ "బై" : టార్గెట్ ప్రైస్ రూ. 315 నుండి రూ. 330 వరకూ పెంపు : 
టెక్ మహీంద్ర: క్రెడిట్ సూసీ రేటింగ్స్ "అవుట్ పెర్ఫార్మింగ్" : టార్గెట్ పెంపు రూ.925 నుండి రూ.950
మారికో :  క్రెడిట్ సూసీ రేటింగ్స్ "అవుట్ పెర్ఫార్మింగ్" : టార్గెట్ పెంపు రూ.380 నుండి రూ.400
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ : CLSA రేటింగ్స్ "బై ": టార్గెట్ పెంపు రూ. 240 నుండి రూ. 265
టైటాన్ కంపెనీ:  క్రెడిట్ సూసీ రేటింగ్స్ "అవుట్ పెర్ఫార్మింగ్" : టార్గెట్ పెంపు రూ.935 నుండి రూ.1,175
స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా; CLSA రేటింగ్స్ "బై ": టార్గెట్ పెంపు రూ. 370 నుండి రూ. 380
డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ : CLSA రేటింగ్స్ " అవుట్ పెర్ఫార్మ్ ": టార్గెట్ ప్రైస్ పెంపు రూ.2850 నుండి రూ.3200
ICICI బ్యాంక్ : మెక్‌క్వారీ రేటింగ్స్ " అవుట్ పెర్ఫార్మ్ ": టార్గెట్ ప్రైస్ పెంపు రూ. 416 నుండి రూ.460
ఏషియన్ పేయింట్స్ : మెక్‌క్వారీ రేటింగ్స్ " అవుట్ పెర్ఫార్మ్ ": టార్గెట్ ప్రైస్ పెంపు రూ. 1180 నుండి రూ.1580
హావెల్స్ ఇండియా: CLSA రేటింగ్స్ " అవుట్ పెర్ఫార్మ్ ": టార్గెట్ ప్రైస్ పెంపు రూ. 720 నుండి రూ.775


Disclaimer: పైన సూచించిన సలహాలు, సూచనలు ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు, ఎనలిస్టులచే ఇచ్చినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి. 



Most Popular