ఖాదిమ్‌ బోర్లా -మార్క్‌సన్స్‌ ఖుషీ

ఖాదిమ్‌ బోర్లా -మార్క్‌సన్స్‌ ఖుషీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఫుట్‌వేర్‌, ఫ్యాషన్‌ యాక్సెసరీస్‌ తయారీ సంస్థ ఖాదిమ్‌ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క ఇదే కాలంలో ప్రోత్సాహకర పనితీరును ప్రదర్శించడంతో హెల్త్‌కేర్‌  సంస్థ మార్క్‌సన్స్‌ ఫార్మా లిమిటెడ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తోంది. ఇతర వివరాలు చూద్దాం.. 

ఖాదిమ్‌ ఇండియా 
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఖాదిమ్‌ ఇండియా నికర లాభం 55 శాతం పడిపోయి రూ. 4 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2017-18) క్యూ3లో దాదాపు రూ. 9 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం సైతం 14 శాతం క్షీణించి రూ. 176 కోట్లను తాకింది. నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 9.75 శాతం నుంచి 6.95 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల కారణంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఖాదిమ్‌ షేరు దాదాపు 14 శాతం కుప్పకూలింది. 389 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 380 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. అంతేకాకుండా 2017 నవంబర్‌లో ఐపీవోకు వచ్చిన రూ. 750 ధరతో పోలిస్తే 50 శాతం దిగజారింది!

Image result for marksans pharma ltd

మార్క్‌సన్స్‌ ఫార్మా 
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో మార్క్‌సన్స్‌ ఫార్మా నికర లాభం 44 శాతం ఎగసి రూ. 25 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 13 శాతంపైగా పెరిగి రూ. 248 కోట్లను తాకింది. స్టాండెలోన్‌ నికర లాభం రెట్టింపై రూ. 12 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం మార్క్‌సన్స్‌ ఫార్మా షేరు 3 శాతం బలపడి రూ. 26 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 27ను అధిగమించింది. కంపెనీలో ప్రమోటర్లకు 48.25% వాటా ఉంది.Most Popular