నష్టాల బాటలో- ఆటో, మెటల్‌ బోర్లా

నష్టాల బాటలో- ఆటో, మెటల్‌ బోర్లా

ప్రతికూల విదేశీ సంకేతాల నడుమ బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 218 పాయింట్లు క్షీణించి 36,753కు చేరింది. నిఫ్టీ సైతం 61 పాయింట్ల వెనకడుగుతో 11,008 వద్ద ట్రేడవుతోంది. గురువారం అమెరికా, యూరొపియన్‌ మార్కెట్లు పతనంకావడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపుతున్నారు. ప్రపంచ ఆర్థిక మందగమన ఆందోళనల నేపథ్యంలో ఆసియాలోనూ మార్కెట్లు డీలాపడటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో తొలుత ఒక దశలో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 11,000 పాయింట్ల కీలక మార్క్‌ దిగువకు చేరింది.  

రియల్టీ ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో ఆటో 3 శాతం పతనంకాగా.. మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ 2-1 శాతం మధ్య నష్టపోయాయి. క్యూ3 ఫలితాలు నిరాశపరచడంతో నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌ 17 శాతం కుప్పకూలింది. మిగిలిన బ్లూచిప్స్‌లో గ్రాసిమ్‌, వేదాంతా, ఐబీ హౌసింగ్‌, ఐషర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, ఐవోసీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌పీసీఎల్‌ 4.5-2 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌ 6 శాతం జంప్‌చేయగా, కొటక్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, ఎయిర్‌టెల్‌ 1.5-0.5 శాతం మధ్య బలపడ్డాయి.

దివాన్‌ పతనం
డెరివేటివ్స్‌లో టాటా మోటార్స్‌ డీవీఆర్‌ 13 శాతం కుప్పకూలగా.. దివాన్‌ హౌసింగ్‌, యూనియన్‌ బ్యాంక్‌, సెయిల్‌, ఐజీఎల్‌, ఐడియా, చెన్నై పెట్రో, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 6-4.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. రిలయన్స్‌ కేపిటల్‌ 11 శాతం దూసుకెళ్లగా, ఆర్‌పవర్, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, పీసీ జ్యువెలర్స్‌, రేమండ్‌, ఆర్‌కామ్, డిష్‌ టీవీ, అరవింద్‌ 8.5-2 శాతం మధ్య ఎగశాయి. రియల్టీ స్టాక్స్‌లో ఫీనిక్స్, డీఎల్‌ఎఫ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 3-1 శాతం మధ్య జంప్‌చేశాయి.

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్న నేపథ్యంలో చిన్న షేర్లలోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ 1 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.5 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1436 నష్టపోగా.. 880 మాత్రమే లాభాలతో ట్రేడవుతున్నాయి. స్మాల్‌క్యాప్స్‌లో ఖాదిమ్‌, ఆంధ్రా పెట్రో, ఐజీపీఎల్‌, బీఐఎల్‌, టీవీఎస్‌ ఎలక్ట్రానిక్స్‌, తంగమాయిల్‌, మ్యాక్స్‌, సిల్‌, ఈరోస్‌, ఆస్ట్రల్‌ పాలీ తదితరాలు 14-5 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular