క్యూ3-ఎక్సెల్‌ క్రాప్‌- ప్రైకోల్‌- పతనం

క్యూ3-ఎక్సెల్‌ క్రాప్‌- ప్రైకోల్‌- పతనం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఓవైపు అగ్రి కెమికల్స్‌ దిగ్గజం ఎక్సెల్‌ క్రాప్‌కేర్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క ఇదే కాలంలో నిరుత్సాహకర పనితీరును ప్రదర్శించడంతో ఆటో విడిభాగాల సంస్థ  ప్రైకోల్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కూ అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. ఇన్వెస్టర్లు ఈ రెండు కౌంటర్లలోనూ అమ్మకాలకు ఎగబడటంతో భారీ నష్టాలతో డీలాపడ్డాయి. ఇతర వివరాలు చూద్దాం.. 

ఎక్సెల్‌ క్రాప్‌కేర్‌ 
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఎక్సెల్‌ క్రాప్‌కేర్‌ నికర లాభం 81 శాతం పడిపోయి రూ. 2.4 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2017-18) క్యూ3లో రూ. రూ. 13 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం సైతం 10 శాతం క్షీణించి రూ. 232 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 69 శాతం పతనమై రూ. 6.5 కోట్లకు చేరింది. ఫలితాల కారణంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఎక్సెల్‌ క్రాప్‌కేర్‌ షేరు 9 శాతం కుప్పకూలింది. 2973 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 3325 వద్ద గరిష్టాన్నీ, రూ. 2950 వద్ద కనిష్టాన్నీ తాకింది.

Related image

ప్రైకోల్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ప్రైకోల్‌ లిమిటెడ్‌ రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించింది. క్యూ3లో రూ. 13 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2017-18) క్యూ3లో రూ. రూ. 9 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం సైతం నామమాత్రంగా 2 శాతం పెరిగి రూ. 334 కోట్లను తాకింది. ఫలితాలు నిరాశపరచడంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ప్రైకోల్‌ షేరు 7.3 శాతం పతనమైంది. 37.50 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 37.25 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. Most Popular