షిప్పింగ్‌ కార్ప్‌ జోరు- ఎంఆర్‌ఎఫ్‌ వీక్‌

షిప్పింగ్‌ కార్ప్‌ జోరు- ఎంఆర్‌ఎఫ్‌ వీక్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో పీఎస్‌యూ సంస్థ షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌సీఐ) కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లాభాలతో కళకళలాడుతోంది. మరోపక్క టైర్ల తయారీ దిగ్గజం ఎంఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ నిరుత్సాహకర పనితీరును ప్రదర్శించడంతో ఈ కౌంటర్‌ అమ్మకాల ఒత్తిడిలో పడింది. ఇతర వివరాలు చూద్దాం,..

షిప్పింగ్‌ కార్పొరేషన్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో షిప్పింగ్‌ కార్పొరేషన్‌ నికర లాభం 120 శాతం దూసుకెళ్లి రూ. 180 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 25 శాతం పెరిగి రూ. 1237 కోట్లను తాకింది. ప్రోత్సాహకర ఫలితాల కారణంగా దేశీయంగా షిప్పింగ్‌ రంగంలో అతిపెద్ద కంపెనీ అయిన షిప్పింగ్‌ కార్పొరేషన్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6.3 శాతం జంప్‌చేసి రూ. 40 వద్ద ట్రేడవుతోంది.  

Image result for MRF Ltd

ఎంఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఎంఆర్‌ఎఫ్‌ నికర లాభం 18 శాతం  క్షీణించి రూ. 279 కోట్లకు పరిమితమైంది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం పెరిగి రూ. 4034 కోట్లను తాకింది. మెటీరియల్‌ ధరలు పెరగడంతో వ్యయాలు రూ. 2196 కోట్ల నుంచి రూ. 2712 కోట్లకు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. వాటాదారులకు షేరుకి రూ. 3 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎంఆర్‌ఎఫ్‌ షేరు 3.4 శాతం పతనమై రూ. 57,382 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 4 శాతం జారి రూ. 57,000 వద్ద దాదాపు రెండేళ్ల కనిష్టాన్ని తాకింది. గురువారం సైతం ఈ షేరు 1 శాతం నీరసించి రూ. 59,411 వద్ద ముగిసింది. Most Popular