కంపెనీ వివరణ- రేమండ్‌ జూమ్‌

కంపెనీ వివరణ- రేమండ్‌ జూమ్‌

ప్రమోటర్‌ గౌతమ్‌ సింఘానియా వ్యక్తిగత సంస్థ జేకే ఇన్వెస్టర్స్‌(బాంబే) లిమిటెడ్‌తో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వాస్తవ విరుద్ధమంటూ టెక్స్‌టైల్స్‌ దిగ్గజం రేమండ్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. దీంతో ఈ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టి టర్న్‌అరౌండ్‌ అయ్యింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో రేమండ్‌ షేరు 7.5 శాతం జంప్‌చేసి రూ. 703 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 710 వద్ద గరిష్టాన్ని తాకింది. అనుమానాస్పద లావాదేవీల వార్తల కారణంగా గురువారం ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 12 శాతం వరకూ పతనమైంది. చివరికి రూ. 654 వద్ద ముగిసింది. ఇతర వివరాలు చూద్దాం...

చట్టానికి అనుగుణంగానే
ప్రమోటర్ గౌతమ్‌ సింఘానియా వ్యక్తిగత సంస్థ జేకే ఇన్వెస్టర్స్‌తో నిర్వహిస్తున్న బిజినెస్‌ లావాదేవీలు చట్టానికి లోబడే ఉన్నట్లు లిస్టెడ్‌ సంస్థ రేమండ్‌ పేర్కొంది. ఇందుకు తగిన అనుమతులు తీసుకున్నట్లు తెలియజేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు సైతం వెల్లడించామని, పేరున్న స్వతంత్ర అకౌంటింగ్‌ సంస్థ నుంచి వీటికి సర్టిఫికేషన్‌ ఉన్నట్లు తెలియజేసింది. ప్రయివేట్‌ సంస్థ జేకే ఇన్వెస్టర్స్‌కు రేమండ్‌ తొలుత ఉత్పత్తులను విక్రయించి తిరిగి అధిక ధరకు కొనుగోలు చేస్తున్నట్లు మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌క్వింట్‌లో ఆరోపణలు వచ్చాయి. రేమండ్‌ నుంచి కొనుగోలు చేస్తున్న ఫినిష్‌డ్‌ గూడ్స్‌కు జేకే ఇన్వెస్టర్స్‌ సెకండరీ ప్యాకేజింగ్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. Most Popular