నష్టాలతో షురూ- టాటా మోటార్స్‌ స్కిడ్‌

నష్టాలతో షురూ- టాటా మోటార్స్‌ స్కిడ్‌

ప్రపంచ ఆర్థిక మందగమన ఆందోళనల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. గురువారం అమెరికా, యూరొపియన్‌ మార్కెట్లు పతనంకావడంతో ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో సెన్సెక్స్‌ 220 పాయింట్లు తిరోగమించింది. ప్రస్తుతం 160 పాయింట్లు తక్కువగా 36,811 వద్ద కదులుతోంది. నిఫ్టీ సైతం 43 పాయింట్ల వెనకడుగుతో 11,026 వద్ద ట్రేడవుతోంది. ఆసియాలోనూ మార్కెట్లు నష్టపోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

ఆటో వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ఆటో 1.6 శాతం క్షీణించగా.. మెటల్‌, బ్యాంక్స్‌, మీడియా 1-0.4 శాతం మధ్య నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌ 16 శాతం కుప్పకూలింది. క్యూ3 ఫలితాలు నిరాశపరచడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మిగిలిన బ్లూచిప్స్‌లో జీ, వేదాంతా, ఐషర్, సన్‌ ఫార్మా, ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఓఎన్‌జీసీ 2.2-0.8 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌, టైటన్‌, పవర్‌గ్రిడ్‌, ఐబీ హౌసింగ్‌, గ్రాసిమ్‌, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్, బజాజ్‌ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్ 2-0.7 శాతం మధ్య బలపడ్డాయి.

Related image

సుజ్లాన్‌ పతనం
డెరివేటివ్స్‌లో టాటా మోటార్స్‌ డీవీఆర్‌ 16 శాతం కుప్పకూలగా.. సుజ్లాన్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఉజ్జీవన్‌, శ్రేఈ ఇన్‌ఫ్రా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐడియా, కర్ణాటక బ్యాంక్‌, పీఎన్‌బీ 6.5-2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. రిలయన్స్‌ కేపిటల్‌, ఆర్‌పవర్, రేమండ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, పీసీ జ్యువెలర్స్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్, మహానగర్‌ గ్యాస్‌, మణఫ్పురం 9.3-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి.

చిన్న షేర్లు ఫ్లాట్‌
మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్న నేపథ్యంలో చిన్న షేర్లు ఫ్లాట్‌గా కదులుతున్నాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ 0.25 శాతం నీరసించింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 645 నష్టపోగా.. 523 లాభాలతో ట్రేడవుతున్నాయి.Most Popular