రైతులకు ఆర్బీఐ వరాలు-హామీలేని రుణాల పరిమితి రూ.1.50 లక్షలకు పెంపు !

రైతులకు ఆర్బీఐ వరాలు-హామీలేని రుణాల పరిమితి రూ.1.50 లక్షలకు పెంపు !

ఇటీవల ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో రైతుల మీద వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్బీఐ కూడా రైతులకు తమ వంతు సాయం చేస్తామంటూ కొత్త వరాన్ని ఇచ్చింది. గురువారం ప్రకటించిన ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ రైతులకు హామీలేని రుణ పరిమితిని పెంచనున్నట్టు తెలిపారు. హామీ అవసరం లేకుండా ఇచ్చే రుణాల పరిమితిని రూ. లక్ష నుండి రూ. 1.60 లక్షల వరకూ పెంచనున్నారు. ద్రవ్యోల్బణం, పెట్టుబడుల పెరుగుదల వంటి అంశాల కారణంగా రైతులు వ్యవసాయంలో పలు కష్టాలను ఎదుర్కొంటున్నారు. పంటకు పెట్టుబడులు లేక, గిట్టుబాటు ధరలు దొరక్క, భారతీయ రైతు కుదేలయ్యాడు. వీరికి అండగా ఇప్పుడు ఆర్బీఐ కూడా తనవంతు సహాయాన్ని ప్రకటించింది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం రైతులకు ఒక యూనిట్‌కు రూ.6000 పెట్టుబడులను ఇస్తామని ప్రకటించింది. దీనికి తోడు ఇప్పుడు RBI ఇచ్చే హామీ లేని రుణాల పరిమితి పెంపు కూడా రైతులకు ఆసరాగా నిలుస్తుందని అగ్రికల్చర్ విశ్లేషకులు భావిస్తున్నారు. 


 Most Popular