RBI పరపతి విధానాల వెల్లడి తరువాత ఈ స్టాక్స్‌ను చూడొచ్చు..!

RBI పరపతి విధానాల వెల్లడి తరువాత ఈ స్టాక్స్‌ను చూడొచ్చు..!

మధ్యంతర బడ్జెట్ తరువాత మార్కెట్లు వరుస ర్యాలీ చేస్తున్నా... RBI తన పరపతి విధానాన్ని నేడు వెల్లడించనున్న నేపధ్యంలో నిఫ్టీ, సెన్సెక్స్ గరిష్టానికి చేరుకున్నాయి. నిఫ్టీ 11,000 పాయింట్లు, సెన్సెక్స్ 37,000 పాయింట్లు దాటడం వెనుక ఆర్బీఐ పరపతి విధానాలు, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు ఉన్నాయి. మదుపర్లు, రిటైల్ ట్రేడర్లు, విదేశీ ఇన్వెస్టర్లు, ఫండ్ మేనేజర్లు  శక్తి కాంత్ దాస్ నేతృత్వంలోని కొత్త ఆర్బీఐ కమిటీ ఎం చెప్పబోతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. RBI కి చెందిన మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఈ ఫిబ్రవరి 7న వెల్లడించబోయే అంశాలు స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. కాగా మరి కొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆర్బీఐ  వడ్డీ రేట్లు, పాలసీ రేట్లు , డిపాజిట్ రేట్లపై పెద్దగా వడ్డనలు చేయకపోవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. మార్కెట్లకు ఊతమిచ్చేందుకు కొంత వరకూ ప్రయత్నించవచ్చు. ద్రవ్యోల్బణం అదుపుకు కొన్ని చర్యలు ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం 4శాతానికి పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. RBI ద్రవ్య విధాన ధృక్పథంలో రేటు తగ్గింపులు ఉండొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఆర్బీఐ న్యూట్రల్ విధానాలను అవలంబించవచ్చని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. 
అయితే..బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్న ఇన్వెస్టర్లను కొనసాగమనే చెబుతున్నారు ఎనలిస్టులు. బ్యాంకింగ్, వినియోగ రంగం,  అధిక రుణ భారంతో ఉన్న స్టీల్, పవర్, రియల్ ఎస్టేట్ , ఇన్ఫ్రా వంటి రంగాలు ఈ ఆర్బీఐ పరపతి విధానాల వెల్లడి తరువాత పుంజుకోవచ్చని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొన్నాయి. సానుకూల వడ్డీ రేట్ల కోత ఉండొచ్చని ఇది ఆయా రంగాలను ఉపయుక్తంగా ఉండబోతుందని వారి అంచనా. మార్కెట్ల అంచనాల మేరకు వడ్డీ రేట్ల తగ్గింపు ఉన్నట్టైతే..  ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, HDFC, బజాజ్ ఫిన్ , మారుతీ సుజుకీ, అశోక్ లేల్యాండ్, వోల్టాస్ , వర్ల్‌పూల్, వంటి స్టాక్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  
RBI వడ్డీ రేట్ల తగ్గింపు ఈ ఫిబ్రవరి నెల పాలసీ ద్వారా  కొన్ని స్టాక్స్ కీ బెనిఫీషియరీస్ గా మారున్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ద్రవ్య సమీక్ష తరువాత లాభపడే కొన్ని స్టాక్స్‌ను వారు సూచిస్తున్నారు. అవేంటో చూద్దామా.

ఆటో రంగం ;
హీరో మోటోకార్ప్ , TVS మోటార్ కంపెనీ. బజాజ్ ఆటో 
ఎలక్టానిక్ ఉపకరణాలు : 
హావేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, వోల్టాస్ , బ్లూస్టార్ , L&T
బ్యాంకింగ్ , నాన్ బ్యాంకింగ్ రంగం:
ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, బజాజ్ ఫిన్ 
వినియోగ రంగం:
ఏషియన్ పేయింట్స్, గోద్రేజ్ ఇండియా, యూనీలివర్ , కోరమాండల్ ఇంటర్నేషనల్ 
హోటల్స్ రంగం:
ఇండియన్ హోటల్స్ లిమిటెడ్ 
 

Disclaimer: పైన పేర్కొన్న విషయాలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు, ఎనలిస్టులు సూచించినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.



Most Popular