1 సంవత్సర కాలానికి ప్రాఫిట్స్ కావాలా? అయితే ఈ స్టాక్స్ చూడండి!!

1 సంవత్సర కాలానికి ప్రాఫిట్స్ కావాలా? అయితే ఈ స్టాక్స్ చూడండి!!

కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టింది. రానున్న కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆర్బీఐ పాలసీలు కూడా ప్రకటించబడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మదుపర్లు ఏ ఏ స్టాక్స్ మీద ఇన్వెస్ట్‌ చేయాలి? ఏ రంగాలు లాభదాయకంగా ఉండనున్నాయి. ఇదే విషయంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎడిల్వీజ్ సెక్యూరిటీస్ ముదపర్లకు పలు సూచనలు చేసింది. రానున్న సంవత్సర కాలంలో ఏ స్టాక్స్ ప్రభావం చూపనున్నాయో ఎడిల్వీజ్ ఓ  గైడ్‌ను తయారు చేసింది. అదేంటో చూద్దామా? 

Image result for titan company logo
టైటాన్ కంపెనీ:  రేటింగ్స్ "బై" : టార్గెట్ ప్రైస్ రూ. 1,182
టైటాన్ కంపెనీ తన మూడో క్వార్టర్‌లో గణనీయ ఫలితాలను వెల్లడించింది. టైటాన్ జ్యూయెల్లరీ విభాగం అత్యధిక వృద్ధిని కనబరిచింది. 2020 ఆర్ధిక సంవత్సరం పెళ్ళిళ్ళ సీజన్‌తో నిండి ఉండడంతో జ్యూయల్రీ విభాగంలో అమ్మకాలు పెరగొచ్చు. రిటైల్ రంగంలో వ్యాపార విస్తరణ, ముడి సరుకు ధరల తగ్గుదల, వంటి కారణాలతో టైటాన్ స్టాక్స్ ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. 

Image result for sbi
స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (SBI) : రేటింగ్స్ " బై ": టార్గెట్ ప్రైస్ రూ. 35
గత త్రైమాసిక ఫలితాల్లో PAT (ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్) రూ. 3,950 కోట్లు గా నమోదు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గరిష్ట లాభాలను చవిచూసింది SBI మాత్రమే. నాన్ బ్యాంకింగ్ రాయితీలు కూడా SBI కి కలిసొచ్చే అంశాలుగా ఎనలిస్టులు భావిస్తున్నారు. స్థిరమైన వృద్ధి, NPA ల తగ్గుదల బ్యాంకు గ్రోత్‌కు దోహద పడుతున్నాయి.

Image result for dabur india
డాబర్ ఇండియా:  రేటింగ్స్ " బై " ; టార్గెట్ ప్రైస్ రూ. 535
డాబర్ తన డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో ఎబిటా , ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ వరుసగా 11.8శాతం, 10.4శాతం  వృద్ధిని కనబరిచాయి. రూరల్ గ్రోత్ 400 బేసిస్ పాయింట్లు పెరిగింది.  హెర్బల్ మార్కెట్ల విస్తరణ, ప్రీమియం, ఇన్నోవేటివ్ ఆవిష్కరణలు, గ్రామీణ ప్రాంతాలకు వ్యాపార విస్తరణ వంటి అంశాలు డాబర్‌ను ఆగ్రపథంలో నిలబెట్టాయి. 

Image result for dr. reddy's laboratories
డా. రెడ్డీస్ ల్యాబరేటరీస్:  రేటింగ్స్ " బై ": టార్గెట్ ప్రైస్ రూ. 3,450 
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తన మూడో క్వార్టర్‌లో బలమైన ఫలితాలను వెల్లడించింది. దేశీయ వ్యాపారంలోనే కాకుండా గ్లోబల్ మార్కెట్లలో కూడా తన ఉత్పత్తుల మార్కెట్ పెరిగింది. కొత్త మందుల ఆవిష్కరణ, కాంప్లెక్స్ జనరిక్స్ పైప్ లైన్, స్ట్రాంగ్ ఎర్నింగ్స్ వంటి అంశాలు డాక్టర్ రెడ్డీస్ స్టాక్ ను ఆకర్షణీయంగా మార్చాయి. 

Image result for airtel
భారతీ ఎయిర్ టెల్ : రేటింగ్స్  "బై" : టార్గెట్ ప్రైస్ రూ. 396
దలాల్ స్ట్రీట్ అంచనాల మేరకు భారతీ ఎయిర్ టెల్ తన మూడో క్వార్టర్ ఫలితాలను వెల్లడించింది. 4G సబ్‌స్క్రిప్షన్స్ పెరగడం, మార్కెట్ రెవిన్యూ పెరగడం, ARPU రూ.121 కు చేరుకోవడం వంటివి భారతీ ఎయిర్ టెల్‌ను తిరిగి బరిలోకి నిలిపాయి. రానున్న సంవత్సర కాలంలో జియోకి ధీటుగా ఎదిగే ఏకైక టెలికాం ఆపరేటర్ ఎయిర్ టెల్ మాత్రమేనని ఎనలిస్టులు భావిస్తున్నారు.   

Disclaimer: పైన పేర్కొన్న విషయాలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు, ఎనలిస్టులు సూచించినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.Most Popular