ఎకార్ హోటల్స్, ఇంటర్ గ్లోబ్ హోటల్స్ జేవీగా హైదరాబాద్ లో ఐబిస్ హోటల్ ప్రారంభం

 ఎకార్ హోటల్స్, ఇంటర్ గ్లోబ్ హోటల్స్ జేవీగా హైదరాబాద్ లో ఐబిస్ హోటల్ ప్రారంభం

ఆతిధ్య రంగంలో తనదైన శైలిలో దూసుకెళుతోన్న ఎకార్ హోటల్స్, ఇంటర్ గ్లోబ్ హోటల్స్ భాగస్వామ్యంతో హైదరాబాద్ లో తమ ఐదోవ హోటల్ ఐబిస్ ను ప్రారంభించాయి. బడ్జెట్ హోటల్స్ కేటగిరీలో ఐబిస్ హైదరాబాద్ లో మొట్టమొదటి హోటల్ అని ఎకార్ హోటల్స్ తెలిపింది. బడ్జెట్ హోటల్స్ బ్రాండ్ ఐబిఎస్ పేరుతో ఇప్పటికే దేశవ్యాప్తంగా 12 హోటల్స్ ఉండగా ఇది 13వ హోటల్ అని ఎకార్ అంటోంది.  పూర్తి స్థాయి సదుపాయలతో 178 సౌకర్యవంతమైన రూములు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని దీంతో పాటు 50 ఎంబీసీఎస్ వైఫై హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్నామని ఐబిస్ హైదరాబాద్ జీఎం రూబిన్ తెలిపారు. తమ దగ్గర కేవలం 4వేల 999 రూపాయలకే త్రీస్టార్ ఫెసిలిటీస్ తో రూమ్ దొరుకుతోందని ఆయన తెలిపారు. ఈ హోటల్ కోసం సుమారు వంద కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టారని రూబిన్ అన్నారు.Most Popular