వచ్చేవారం చాలెట్ హోటల్స్ ఐపీఓ

వచ్చేవారం చాలెట్ హోటల్స్ ఐపీఓ

కె రహేజా గ్రూప్ ప్రమోట్ చేసిన చాలెట్ హోటల్స్ వచ్చే వారం ఐపీఓకు రాబోతోంది. ఈ ఇష్యూ ద్వారా రూ.1640 కోట్లను సమీకరించాలనేది ఈ ఐపీఓ లక్ష్యం. 
ఇందులో రూ.950 కోట్ల విలువైన వాటాలను తాజాగా విడుదల చేస్తే.. మరో 2.46 కోట్ల షేర్లను ప్రమోటర్లు రూ.690 కోట్లకు అమ్మకానికి పెట్టారు. 

రూ.275-280 ప్రైస్ బ్యాండ్ మధ్య వస్తున్న ఈ ఐపీఓ వచ్చే వారం సబ్‌స్క్రిప్షన్‌కు రాబోతోంది. మినిమం లాట్ సైజ్ 53 షేర్లు. 

సమీకరించిన నిధులను రుణభారం తగ్గించుకోవడంతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోబోతున్నారు. 

కొన్ని హోటల్స్‌ను కలిగి ఉన్న చాలెట్ హోటల్స్ వాటిని అభివృద్ధి చేస్తోంది. వీటితో పాటు లగ్జరీ అప్ స్కేల్ హాస్పిటాలిటీ సేవలను కమర్షియల్, రెసిడెన్షియల్‌ ప్రాపర్టీస్‌కు అందిస్తోంది. 

మార్చి 2018 నాటికి కంపెనీ టర్నోవర్ రూ.930 కోట్లుగా, ఎబిటా రూ.350 కోట్లుగా  నమోదైంది. 2018 నాటికి సంస్థ రుణభారం రూ.2653 కోట్లు. Most Popular