ఎలక్షన్స్ సమయంలో అవలంబించాల్సిన ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ఇదే !

ఎలక్షన్స్ సమయంలో అవలంబించాల్సిన ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ఇదే !

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి.. మరికొద్ది వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. రానున్న 6 నెలల్లో సార్వత్రిక ఎన్నికల ప్రభావం మార్కెట్లపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రభావం చూపడం సహజం. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ మార్కెట్లు రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కదలాడుతుంటాయి. ఈ నేపథ్యంలో మదుపరులు ఎలా వ్యవహరించాలి అనేది ప్రధాన అంశంగా మారింది. 

ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలి : 
ప్రతీ ఇన్వెస్టర్ ఏడాది ప్రారంభం నుంచి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పోర్ట్ ఫోలియోలో లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటారు. ఒక్కో షేర్ నుంచి సుమారు 5 నుంచి 15 శాతం రిటర్న్ కావాలని నిర్ణయించుకుంటారు. ఉదాహరణకు మీ ప్రస్తుత పోర్ట్ ఫోలియో 10 శాతం రిటర్న్ ఇస్తే తదుపరి టార్గెట్ 12 శాతం ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఇలా లాంగ్ టర్మ్ గోల్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల షార్ట్ టెర్మ్ ఓలటాలిటీని ఎదుర్కొని రిటర్న్స్ పొందే వీలుంది. ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఎలాంటి మార్కెట్ లో అయినా రిటర్న్స్ పొందవచ్చు. సాధారణంగా రాజకీయ పరిణామాలు ఈక్విటీ మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపకపోయినా, పరోక్షంగా స్వల్పకాలికంగా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలు తీసుకునే పాలసీలు ఎలా ఉంటాయి అనే ఆందోళన మదుపరుల్లో కలుగుతుంది. ఈ నేపథ్యంలో స్వల్ప కాలిక ఒడిదిడుకులకు లోనుకాకుండా బలమైన ఫండమెంట్స్ ఉన్న  స్టాక్స్ ఎంపిక చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక వేళ మీ పోర్ట్ ఫోలియో అనుకున్న టార్గెట్ ను సాధిస్తే ప్రాఫిట్ బుక్ చేసుకొని రిస్క్ నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే తొందరపడి ఎగ్జిట్ పోల్స్, ఇతర ఒపీనియన్ పోల్స్ మాటల్లో పడి సెలెక్టెడ్ స్టాక్స్‌ను కొనడం లాంటి పనులకు దూరంగా ఉంటే మంచిది. 

సిప్ ద్వారా మదుపు :
సిస్టమెటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ద్వారా మదుపు చేస్తే మార్కెట్ ఒడిదుడుకులకు సంబంధం లేకుండా మీ పెట్టుబడి స్థిరంగా రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రతీ నెలా స్థిరమైన మొత్తం మదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో మీకు లబ్ది చేకూరుతుంది. సాధారణంగా ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఓలటాలిటీని తట్టుకునేందుకు సిప్ అత్యుత్తమమైన మార్గంగా కనిపిస్తోంది.  Most Popular