పేరుకే చిన్న మ్యూచువల్ ఫండ్..కానీ లాభాలు మాత్రం 21.25 శాతం అప్ !!

పేరుకే చిన్న మ్యూచువల్ ఫండ్..కానీ లాభాలు మాత్రం 21.25 శాతం అప్ !!

ఓ చిన్న ఈక్విటీ ఫండ్, అందులోనూ అతి చిన్న కంపెనీ నుండి వచ్చిన ఫండ్ మార్కెట్ ఛార్ట్‌ల్లో మంటలు మండిస్తుందని ఒక ఇన్వెస్టర్‌గా మీరు ఊహించగలరా? అందులోనూ గత 5 సంవత్సరాల కాలం లోనూ దాదాపు 21.25శాతం రిటర్న్స్ ను సాధించిందంటే నమ్మగలరా? అవునండీ.. మీరు చదివింది నిజమే. క్వాంట్ మనీ మేనేజర్స్ అనే సంస్థ నుండి వచ్చని క్వాంట్ ట్యాక్స్ ప్లాన్ (QTS)  గత మూడేళ్ళ కాలానికి దాదాపు 17శాతం రిటర్న్స్ ను అందించింది. మిగతా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇది అత్యంత ఎక్కువ లాభార్జనను ఇచ్చింది. ప్రస్తుతం ట్యాక్స్ రిటర్న్స్  ఎండింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇన్వెస్టర్లు ట్యాక్స్ సేవింగ్ కోసం మ్యూచువల్ ఫండ్స్ ను వెదుకుతారు.   లాస్ట్ మినిట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కొరకు మార్కెట్‌ను జల్లెడ పడతారు. మార్చ్ ఎండింగ్ కల్లా రిటర్న్స్ దాఖలు చేయాల్సి రావడమే ఇందుకు కారణం. గత 5 ఏళ్ళుగా ఈ క్వాంట్ ట్యాక్స్ ప్లాన్ అద్వితీయమైన ఫలితాలను వెల్లడించడంతో ఇప్పుడు మదుపర్లు ఇటు వైపు ఆసక్తిగా చూస్తున్నారు. 
ఎస్కార్ట్స్ గ్రూప్‌కు చెందిన ఈక్విటీ సంస్థ
ఢిల్లీకి చెందిన క్వాంట్ మనీ మేనేజర్స్ దేశంలో QTSతో బాటు ఈక్విటీ రుణ పథకాలను నిర్వహిస్తున్న సంస్థగా పేరు గాంచింది.  ఈ కంపెనీ ట్రాక్టర్లు , మోటార్ వాహనాల తయారీ సంస్థ ఎస్కార్ట్ లిమిటెడ్ కు చెందినదే. గతంలో ఎస్కార్ట్  అసెట్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ గా పిలవబడేది.1995లో ఎస్కార్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ (నాన్ బ్యాంకింగ్ సంస్థ) ద్వారా ఈ కంపెనీని స్థాపించారు.  అయితే.. దేశంలో మొత్తం మ్యూచువల్ ఫండ్ సంస్థలన్నీ ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేసేవి. ఈ కంపెనీ ఒక్కటే ఢిల్లీ కేంద్రంగా పనిచేసేది. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కార్పస్ వాల్యూ రూ. 23.61 ట్రిలియన్లు గా ఉంటే.. ఎస్కార్ట్ ఫండ్ కంపెనీ కార్పస్ ఫండ్ మాత్రం కేవలం రూ. 200 కోట్లుగా ఉండేది. దేశంలోనే అత్యంత చిన్న ఫండ్ మేనేజర్ గా ఈ సంస్థ తన కార్యకలాపాలను నడిపేది. 2015లో ఎస్కార్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో క్వాంట్ గ్రూప్ కు చెందిన సందీప్ టాండన్ 9 శాతం వాటాలను కొనుగోలు చేశారు. 2017లో ఎస్కార్ట్ గ్రూప్ ఫండ్ మేనేజ్‌మెంట్ వ్యాపారంలో నుండి బయటకు రావడంతో అప్పటి నుండి టాండన్ గ్రూప్ ఈ కంపెనీని టేకోవర్ చేసింది.2018 మార్చి నుండి  క్వాంట్ మనీ మేనేజర్స్ గా పేరు మార్చుకున్న ఈ సంస్థ శరవేగంగా పైపైకి ఎగబాకింది. QTS  పథకం కింద కంపెనీల బ్యాలెన్స్ షీట్లు, ఫండమెంటల్స్, వార్షిక నివేదికలు , వంటి వాటిని శోధించడం, విశ్లేషించడం కోసం ఏకంగా మల్టిపుల్ డేటా పాయింట్లను అభివృద్ధి చేసింది. ఈ డేటా విశ్లేషణ ఆధారంగా గత 2018 డిసెంబర్‌లో తన వద్ద ఉన్న HDFC హోల్డింగ్స్ ను పూర్తిగా వదిలించుకుంది. ఇదే సమయంలో ఇతర ఈక్విటీ ఫండ్స్ మాత్రం HDFC బ్యాంక్ స్టాక్స్ ను అట్టే పెట్టుకున్నాయి. 2018 చివరి నాటికి HDFC స్టాక్స్ పతనం కావడంతో మిగతా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు నష్టపోయినా.. క్వాంట్ మనీ మనేజర్స్ మాత్రం లాభాల్లో కనబడింది.  అలాగే.. 2018 సంవత్సరం మొత్తం QTS హిందూస్థాన్ యూనిలివర్ స్టాక్స్ జోలికే పోలేదు. అక్టోబర్ 2018లో మాత్రం  తన కార్పస్‌లో  2.98 శాతం మొత్తం HUL లో పెట్టుబడి పెట్టింది. నవంబర్ 2018లో హిందూస్థాన్ షేర్లను అమ్మేసి.. తిరిగి డిసెంబర్‌లో  కార్పస్ ఫండ్ నుండి 5.16శాతం మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టింది. మా డేటా పాయింట్ల విశ్లేషణకు అనుగుణంగానే తాము షేర్లు కొనడం కానీ అమ్మడం కానీ చేస్తామని.. అదే మా ప్రాఫిట్ రహస్యమని టాండన్ పేర్కొన్నారు. ఒక స్టాక్ మీద పెట్టుబడి పెట్టడానికి లేదా బై , హోల్డ్ అంశాలను పట్టించుకోమని .. తమ ఇన్వెస్టర్లకు లాభాలను పంచాలన్నదానిపైనే మా ఫోకస్ ఉంటుందని సందీప్ టాండన్ అంటారు. పడిపోయిన.. లేదా పడిపోతున్న స్టాక్స్ ను పూర్తిగా వదిలేయడమే QTS విజయ రహస్యమని ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారు పేర్కొన్నారు. కోటక్ మహీంద్ర, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి స్టాక్స్ వైపు ఈ ఈక్విటీ సంస్థ గత సంవత్సరం కన్నెత్తి కూడా చూడలేదు. 
ఇలా స్టాక్స్ ఎంపికలో పూర్తి విశ్లేషణాత్మకంగా ఉండబట్టే..గత 5 ఏళ్ళ కాలంలో తన ఇన్వెస్టర్లకు 21.25శాతం ప్రాఫిట్స్‌ను రిటర్న్స్ గా ఇచ్చింది క్వాంట్ మనీ మేనేజర్స్ . మరి మీ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ ఎంటి..? 

Disclaimer: స్టాక్స్ ఎంపిక , మరియు ఇన్వెస్ట్‌మెంట్స్ సమయంలో మరోసారి నిపుణుల సూచనలు తీసుకోగలరని మనవి. 
 Most Popular