కేంద్ర బడ్జెట్ 2019 - జైట్లీ రిపోర్ట్ కార్డ్

కేంద్ర బడ్జెట్ 2019 - జైట్లీ రిపోర్ట్ కార్డ్

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఎన్డీఏ సర్కారు చివరి బడ్జెట్ అయిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. గడిచిన నాలుగు బడ్జెట్లలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసి చూస్తే కొద్ది మేర సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చడంలో జైట్లీ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా  జైట్లీ బాధ్యతలు చేపట్టే సమయంతో పోల్చితే జీడీపీలో  ద్రవ్య లోటు శాతం తగ్గింది. ముఖ్యంగా దీనికి గ్లోబల్ గా క్రూడ్ ధరల పతనం తోడ్పడింది. అయితే జైట్లీ ఆర్థిక ప్రణాళిక విమర్మలకు దూరమని చెప్పలేము. రెవెన్యూ లోటు ఇంకా లక్ష్యాలకు దూరంగానే నిలిచింది. బాండ్ల రూపంలో నిధుల సేకరణ, పబ్లిక్ సెక్టార్ రుణాలు తీసుకోవడం ప్రజలపై రుణభారాన్ని మోపింది. 

ఆర్థిక లక్ష్యాలు నెరవేరాయా ? 
జైట్లీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి ద్రవ్యలోటు 5 శాతానికి కొద్దిగా అటు ఇటుగా ఉంది. యూపీఏ ప్రభుత్వం ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగానే ఎదుర్కొన్నప్పటికీ, ఉద్దీపనలను సరైన సమయంలో అందించడంలో విఫలమైంది. 2009-10 నాటికి ద్రవ్యలోటు జీడీపీలో 6.5శాతానికి చేరింది. అయితే ఈ ద్రవ్యలోటును తగ్గించేందుకు జైట్లీ తీసుకున్న చర్యలు తోడ్పడ్డాయి. క్రూడ్ ఆయిల్ ధరల పతనం జైట్లీ లక్ష్యానికి అదనపు బలాన్ని చేకూర్చాయి. డీజిల్ ధరలను డి రెగ్యులేట్ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూరింది. 2016-17 వరకూ ప్రభుత్వం ద్రవ్యలోటు పూరించడమే లక్ష్యంగా పనిచేసింది. ద్రవ్యలోటును 3 శాతానికి తగ్గించడమే టార్గెట్ గా జైట్లీ టీమ్ ప్రణాళిక వేసింది. అయితే జీఎస్టీ అమలు, బ్యాంకుల రీకాపిటలైజేషన్ ఈ ప్రణాళికను గాడి తప్పేలా చేశాయి. ఫలితంగా ప్రభుత్వం 2017-18లో 3.2 శాతానికి ద్రవ్యలోటు తగ్గించాలి అనే టార్గెట్ తప్పింది. ప్రస్తుతం ద్రవ్యలోటు 3.5 శాతానికి అటుఇటుగా నిలిచింది.  

రెవన్యూ లోటు సంగతేంటి ? 
ద్రవ్యలోటును తగ్గించడంలో చెప్పుకోదగిన విజయమే జైట్లీ సాధించారు. అయితే రెవెన్యూలోటును పూడ్చడంలోనూ కూడా జైట్లీ టమ్ లక్ష్యం ఏర్పరచుకొని పనిచేసింది. ఎఫ్ఆర్‌బీఏం యాక్ట్ ప్రకారం 2008-09 నాటికి రెవెన్యూ లోటును పూడ్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వాలు టార్గెట్ పూర్తి చేయడంలో విఫలమయ్యాయి. అదే సమయంలో జైట్లీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రెవెన్యూ లోటును 3.1శాతం నుంచి 1.9 శాతానికి తగ్గించగలిగారు. అయితే గత బడ్జెట్ లో రెవెన్యూలోటుని పూడ్చే లక్ష్యం నుంచి పక్కకు తప్పుకుంది. ఈ చర్య విమర్శల పాలైంది. అయితే ఇందులో ప్రభుత్వ వాదనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.  భారత్ లాంటి దేశంలో మూలధన వ్యయంతో పరిస్థితి చక్కబడుతుందనే ఆనవాళ్లు లేవని తేల్చింది. అంతే కాదు, మూలధన వ్యయం, రాబడి వ్యయంతో సమప్రాధాన్యం కలిగి ఉందని తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వ గణాంకాల ప్రకారం జీడీపీలో రెవెన్యూలోటు 2.2 శాతంగా ఉంది. 

బ్యాలెన్స్ షీట్ వెలుపలి ఖర్చులు : 
గత ప్రభుత్వం తరహాలోనే బ్యాలెన్స్ షీట్ బయటి లెక్కలు చాలా ఉన్నాయి. గత యూపీఎ ప్రభుత్వం సబ్సిడీల కోసం ఆయిల్, ఫెర్టిలైజర్ బాండ్స్ జారీ చేసింది. అయితే ఇదే పద్ధతిలో మోడీ ప్రభుత్వం సైతం జాతీయబ్యాంకుల రీకేపిటలైజేషన్ కోసం 2.11 లక్షల కోట్ల రూ.లు కేటాయించింది. అలాగే 1.35 లక్షల కోట్ల రూ.లు బాండ్ల అమ్మకం ద్వారా సేకరించింది. అంతే కాదు నిధుల సేకరణకు జైట్లీ టీమ్ కొత్త మార్గాలు అన్వేషించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేర నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్ నుంచి నిధులను వినియోగించింది. గడిచిన రెండేళ్లలో ఈ వెసులుబాటును జైట్లీ టీమ్ పూర్తిగా వినియోగించుకుంది. కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు ఎఫ్‌సీఐ, నేషనల్ హైవేస్ అథారిటీ, ఏయిర్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలు సైతం నేషనల్ స్మాల్ సేవింగ్స్ నిధులను వాడుకోవడం గమనార్హం.  ఫలితంగా బ్యాంకు డిపాజిట్ రేట్లు పడిపోయే అవకాశం ఉండగా, స్మాల్ సేవింగ్స్ వడ్డీ రేట్లు అమాంతం పెరిగే వీలు కలిగింది. Most Popular