రీటైల్ అవకాశాలతో రిలయన్స్ జోరు

రీటైల్ అవకాశాలతో రిలయన్స్ జోరు

సీఎల్ఎస్ఏ తెలిపిన అంచనాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఇవాళ భారీ లాభాలను గడిస్తోంది. దేశంలో అతి పెద్ద కన్జూమర్ కంపెనీగా ఎదగాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మన దేశంలో 550 బిలియన్ డాలర్ల రీటైల్ అకాశాలు ఉన్నట్లుగా సీఎల్ఎస్ఏ తెలిపింది. ఈ వార్తలు రిలయన్స్ కౌంటర్‌లో జోష్ నింపాయి. భారతీయ రీటైల్ పరిశ్రమ గత కొన్నేళ్లలో 3 రెట్లు అభివృద్ధి చెందింది. రాబోయే పదేళ్లలో సంస్థాగత రీటైల్ పరిశ్రమ 9 రెట్లు పెరిగే అవకాశం ఉందని ఈ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ వెల్లడించింది.
మార్కెట్ లీడర్‌గా ఎదగాలన రిలయన్స్ లక్ష్యాలు, అందుకు అనుసరిస్తున్న వ్యూహాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయని... అందుకే ఈ స్టాక్‌కు రూ. 1500 టార్గెట్ ఇస్తున్నట్లు సీఎల్ఎస్ఏ తెలిపింది.

ఈ ప్రభావంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఇవాల్టి ట్రేడింగ్‌లో ఒక దశలో 3 శాతం పైగా లాభపడగా, ప్రస్తుతం 2.86 శాతం లాభంతో రూ. 1128 వద్ద ట్రేడవుతోంది.Most Popular