మ్యూచువల్ సంస్థలు కొంటున్న రిస్ ఫ్రీ స్టాక్స్ ఇవే !

మ్యూచువల్ సంస్థలు కొంటున్న రిస్ ఫ్రీ స్టాక్స్ ఇవే !

స్టాక్ మార్కెట్లు ఒకటి రెండు నెలల నుంచి ఒడిదుడుకుల మధ్య కదలాడుతున్న సంగతి తెలిసిందే. ఇండెక్స్‌లు గరిష్ట స్థాయిల దగ్గర ఉన్నప్పటికీ చాలా స్టాక్స్ మళ్లీ పాత ధరలకు రాలేదు. దీనికి తోడు ఎప్పటికప్పుడు మారిపోతున్న పరిస్థితులతో స్టాక్ పికింగ్ చాలా కష్టమైపోతోంది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు మరింత చెమటోడ్చాల్సి వస్తోంది. అందుకే వాల్యూ బేస్డ్ పిక్స్‌ను వాళ్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అందులోనూ ముఖ్యంగా సంస్థ బిజినెస్ మోడల్, సదరు సెక్టార్‌లో ట్రెండ్ రివర్స్ అయితే లాభాలపై ఎంతటి ఇంపాక్ట్ ఉంటుంది, సదరు రంగంలో ఈ సంస్థకు ఎంతటి పట్టు ఉంది వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అలా అనేక పారామీటర్స్‌ను తీసుకుని కొన్ని స్టాక్స్‌ను వాళ్లు ఎంపిక చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

బిపిసిఎల్ CMP Rs. 338
కొనుగోలు చేసింది - ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.72600 కోట్లు
ఆయిల్ మార్కెటింగ్ సంస్థల్లో బిపిసిఎల్ స్థిరమైన స్థానాన్ని సంపాదించింది. క్యాపిటల్ ఎక్స్‌పాన్షన్‌ ఇప్పట్లో ఏదీ పెద్దగా లేకపోవడంతో క్యాష్ ఫ్లోస్ స్థిరంగా ఉంటాయి. సంస్థ తలపెట్టిన కోచి రిఫైనరీ ఎక్స్‌పాన్షన్ వల్ల గ్రాస్ రిఫైనరీ మార్జిన్స్ మరింత మెరుగవచ్చు. 

ఎన్‌టిపిసి CMP Rs.145
కొనుగోలు చేసింది - ఐసిఐసిఐ, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్
సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1.19 లక్షల కోట్లు

ఇది చాలా లో బీటా స్టాక్. ప్రస్తుత ఒడిదుడుకుల మార్కెట్లో కొద్దిగా సేఫ్ బెట్. అందుకే ఫండ్ మేనేజర్లు ఎక్కువగా దృష్టిపెడ్తున్నారు. రిటర్న్ ఆన్ ఈక్విటీ 15 శాతానికి తగ్గడం లేదు. డెట్ ఈక్విటీ సహా వివిధ  రేషియోల్లో పటిష్టత నమోదవుతోంది. పవర్ డిమాండ్ పెరిగితే ఈ స్టాక్ కూడా మరిన్ని లాభాలను నమోదు చేస్తుంది. 

ఐసిఐసిఐ ప్రూ లైఫ్ CMP Rs.355
కొనుగోలు చేసింది - ఫ్రాంక్లిన్ టెంపుల్టన్
సంస్థ మార్కెట్ క్యాప్ రూ.50266 కోట్లు
సేవింగ్స్, ప్రొటెక్షన్ బిజినెస్ మన దేశంలో ఇంకా అంత గొప్పగా లేదు. అనుకూలమైన స్థితిగతులు, ఫైనాన్షియల్ ప్రోడక్టులపై కస్టమర్లలో పెరుగుతున్న అవగాహన, పటిష్టమైన డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ వంటివన్నీ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలకు కలిసొచ్చే అంశాలు. 

ఎల్ అండ్ టి ఫైనాన్స్ హోల్డింగ్స్ CMP Rs.140
కొనుగోలు చేసింది - డిఎస్‌పి మ్యూచువల్ ఫండ్
సంస్థ మార్కెట్ క్యాప్  రూ. 27213 కోట్లు్
ఈ సంస్థ తన రిటైల్ బుక్‌ను పటిష్టం చేసుకుంటోంది. రూరల్, హౌసింగ్, హోల్ సేల్ ఫైనాన్సింగ్‌లకు పెద్దపీట వేస్తోంది. నిర్మాణ సామగ్రి, బంగారు రుణాలు, వాణిజ్య వాహనాలు, లీజింగ్ వంటి వాటికి రుణాలు ఇచ్చే పద్ధతిని బాగా తగ్గించుకుంది. ఎన్పీఏలు తగ్గడానికి ఇది కూడా ప్రధాన కారణం. 
సెప్టెంబర్ క్వార్టర్‌లో రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.5 శాతంగా ఉంది. ఐఎల్ఎఫ్ఎస్ ఇంపాక్ట్ తమపై ఏ మాత్రం లేదని ఈ మధ్యే ఎల్ టి ఫైనాన్స్ స్పష్టం చేసింది. Most Popular