36,000కు నీళ్లు- నష్టాల ముగింపు!

36,000కు నీళ్లు- నష్టాల ముగింపు!

గత నెల(డిసెంబర్‌)లో చైనా ఎగుమతులు 4.4 శాతం క్షీణించినట్లు తాజాగా వెల్లడైంది. విశ్లేషకులు 3 శాతం వృద్ధిని అంచనా వేశారు. ఇక దిగుమతులు సైతం 7.6 శాతం వెనకడుగు వేశాయి. మరోవైపు మంగళవారం బ్రెక్సిట్ డీల్‌పై యూకే వోటింగ్‌ను చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు బలహీనపడగా.. యూరోపియన్ స్టాక్‌ మార్కెట్లు సైతం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇక దేశీయంగానూ ఇన్వెస్టర్లు తొలి నుంచీ అమ్మకాలకే కట్టుబడటంతో మార్కెట్లు ఆద్యంతం నష్టాలమధ్యే కదిలాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 300 పాయింట్ల వరకూ పతనమైనప్పటికీ చివరికి కొంతమేర కోలుకుంది. ట్రేడింగ్‌ ముగిసేసరికి 156 పాయింట్లు క్షీణించి 35,854 వద్ద నిలిచింది. నిఫ్టీ 57 సైతం పాయింట్లు తక్కువగా 10,738 వద్ద స్థిరపడింది. 

ఫార్మా ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ నష్టపోగా.. ఫార్మా 0.5 శాతం ఎగసింది. మెటల్‌, రియల్టీ, బ్యాంక్‌ నిఫ్టీ, ఐటీ 1.3-0.6 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, గెయిల్‌, ఐబీ హౌసింగ్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్, యూపీఎల్‌, వేదాంతా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్‌టీపీసీ 5-1.6 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బ్లూచిప్స్‌లో యస్‌ బ్యాంక్‌ 6 శాతం జంప్‌చేయగా.. ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ, టాటా మోటార్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఐవోసీ, సిప్లా 2.7-0.6 శాతం మధ్య బలపడ్డాయి. 

Image result for share market down

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్లు నష్టాలతో ముగిసిన నేపథ్యంలో చిన్న షేర్లలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం చొప్పున తిరోగమించాయి. ట్రేడైన షేర్లలో 1488 నష్టపోగా.. 1032 మాత్రమే లాభాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు 
వారాంతాన నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 687 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 123 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 344 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించగా..  డీఐఐలు రూ. 11 కోట్లను మాత్రమే ఇన్వెస్ట్‌ చేశాయి. Most Popular