ఇండియాలోనే అతిపెద్ద బ్రోకరేజ్ సంస్థగా

ఇండియాలోనే అతిపెద్ద బ్రోకరేజ్ సంస్థగా

దేశీయ స్టాక్ బ్రోకరేజ్ సంస్థల్లో టాప్ బ్రోకరేజ్ సంస్థ అయిన ICICI సెక్యూరిటీస్‌ను వెనక్కి నెట్టి నెంబర్ 1 పొజీషన్‌లోకి బెంగుళూరుకు చెందిన జెరోధా సెక్యూరిటీస్ వచ్చింది. దాదాపు 8.47 లక్షల ఇన్వెస్టర్లు మెంబర్లుగా కలిగిన జెరోధా దేశంలోనే అతిపెద్ద బ్రోకరేజ్ సంస్థగా అవతరించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్  ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. సరళీకృత విధానాలు , అతి తక్కువ సర్ ఛార్జీలు, అదనపు సేవల వంటి ఫీచర్లతో అతి తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది జెరోధా. 2016 ఆర్ధిక సంవత్సరంలో జెరోధాకు 61,970 మంది కస్టమర్లు ఉండగా, 2019 ఆర్ధిక సంవత్సరం (9 నెలల కాలానికి ) ఆ సంఖ్య 84,7,016 కు చేరింది. ఇదే సమయంలో ICICI సెక్యూరిటీస్ కస్టమర్లు 84 లక్షల మంది ఉండటం గమనార్హం. దేశంలోని టాప్ బ్రోకరేజ్ సంస్థల్లోని ICICI సెక్యరిటీస్, HDFC సెక్యూరిటీస్, షేర్ ఖాన్, IIFL , జియోజిత్ ఫైనాన్షియల్ వంటి కంపెనీలు తమ యాక్టివ్ క్లైంట్లను క్రమంగా కొల్పోతున్నాయి. గత 12 నెలల కాలంలో ఒక్కసారైన కంపెనీ సేవలను పొంది ఉన్న కస్టమర్‌ను యాక్టివ్ కస్టమర్‌ గా పరిగణిస్తారు. కాగా 2018 డిసెంబర్ నాటికి దాదాపు 89 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లు జెరోధాలో క్రియాశీలంగా ఉన్నట్టు సెబీ తెలిపింది. ICICI సెక్యూరిటీస్ బ్రోకింగ్ ద్వారానే 50శాతం ఆదాయాన్ని ఆర్జించేది. గత డిసెంబర్ నాటికి ఇందులోని యాక్టివ్ కస్టమర్లు క్రమంగా తగ్గుముఖం పట్టసాగారు. అధిక ఛార్జీలు, మార్కెట్ స్థితిగతులు, ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్లు లేక పోవడంతో మదుపర్లు ఇతర బ్రోకరేజ్ సంస్థలకు తరలిపోయారు. జెరోధా తన కస్టమర్లకు , ఇన్వెస్టర్లకు ట్రేడింగ్ సమయంలో అదనపు సౌకర్యాలు కల్పించడమే కాకుండా, సర్వీస్ ఛార్జీల్లో పలు డిస్కౌంట్లను ప్రకటించింది. ఇదే  సంస్థ పెరుగుదలకు కారణమని జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అంటున్నారు. 

Image result for zerodha broking officeMost Popular