ఈ 7 మిడ్ క్యాప్ స్టాక్స్‌ను రికమెండ్ చేస్తున్న CLSA ..!

ఈ 7 మిడ్ క్యాప్ స్టాక్స్‌ను రికమెండ్ చేస్తున్న CLSA ..!

NSE నిఫ్టీ 50 లో కొంత కరెక్షన్ తరువాత మిడ్ క్యాప్ స్టాక్స్ కొంచెం కోలుకున్నాయనే చెప్పొచ్చు. గత సంవత్సరం పూర్తిగా నిరాశ పరిచిన స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ ఈ సంవత్సరం పుంజుకోవచ్చని ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. అయితే.. ఇది అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ కు వర్తించదని, మార్కెట్ ఇండెక్స్‌ల బెంచ్ మార్క్ సూచీల్లో మార్జిన్ల పెరుగదలకు పరిమితులు ఉన్నాయనీ, స్థూల ఆర్ధిక మార్కెట్లలో అనిశ్చితి ఇంకా తొలగలేదని ప్రముఖ స్టాక్ రేటింగ్ సంస్థ CLSA పేర్కొంటుంది. కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ ఇప్పటికే అధిక వాల్యూయేషన్స్ తో ఉన్నాయని, ప్రముఖ ఫారిన్ బ్రోకరేజ్ సంస్థలు కూడా మిడ్ క్యాప్ స్టాక్స్ అయిన వోల్టాస్ ఇండియా, పిడిలైట్ ఇండస్ట్రీస్ వంటి స్టాక్స్ ను విక్రయించాయని CLSA తెలిపింది. అయితే.. ఇక్కడ రానున్న రోజుల్లో మార్కెట్లు ఎలా ఉన్నా.. బాటమ్ లెవల్ లో ఉన్న కొన్ని స్టాక్స్ మంచి పనితీరును కనబరచవచ్చని CLSA పేర్కొంది. ఇండివిడ్యుయల్ కంపెనీస్, లేదా మొత్తం సెక్టార్ రంగాలు.. అంటే కన్జంప్షన్, హెల్త్ కేర్, గృహ విక్రయ రంగం, హోటల్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు ఉత్తమమని CLSA సూచిస్తుంది. 

Image result for CLSA
2019లో ఉత్తమ పనితీరు కనబరిచే 7 మిడ్ క్యాప్ స్టాక్స్‌ను CLSA సూచించింది. అవేంటో చూద్దాం. 

1. ఆదిత్య బిర్లా :  టార్గెట్ ప్రైస్ రూ. 240:  బై రేటింగ్: 
2.
అపోలో హాస్పిటల్స్ : టార్గెట్ ప్రైస్ రూ. 1,500 : బై రేటింగ్స్ 
3.
గోద్రేజ్ ప్రాపర్టీస్ : టార్గెట్ ప్రైస్ రూ. 843 :  బై రేటింగ్స్ 
4.
లెమన్ ట్రీ హోటల్స్ : టార్గెట్ ప్రైస్ రూ. 87 : బై రేటింగ్స్
5.
సుప్రీం ఇండస్ట్రీస్ : టార్గెట్ ప్రైస్ రూ. 1,271 : బై రేటింగ్స్
6.
TTK ప్రెస్టీజ్ : టార్గెట్ ప్రైస్ రూ. 9,000 : బై రేటింగ్స్
7. వెస్ట్ లైఫ్ డెవలప్‌మెంట్ : టార్గెట్ ప్రైస్ రూ. 550 : బై రేటింగ్స్

Disclaimer:  పైన సూచించిన అభిప్రాయాలు స్టాక్ ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు చేసినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి. Most Popular