బంగారం ధర మరింత పెరగొచ్చంటున్న గోల్డ్ మన్ శాక్స్ !!

బంగారం ధర మరింత పెరగొచ్చంటున్న గోల్డ్ మన్ శాక్స్ !!

రానున్న కొద్ది రోజుల్లో బంగారం ధర మరింత పెరగొచ్చని గోల్డ్ మన్ శాక్స్ బ్యాంక్ పేర్కొంటుంది. సంస్థ అంచనా ప్రకారం మరి కొద్ది రోజుల్లో బంగారం ఔన్స్ ధర $1,425 డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేస్తుంది. ఈ స్థాయి ధరలు గత 5 సంవత్సరాల్లో రాలేదని..ఇదే అత్యంత గరిష్టమని గోల్డ్ మన్ శాక్స్ అంటోంది. సెంట్రల్ బ్యాంక్ ఆర్ధిక మాంద్యం భయాల వల్ల బంగారం కొనుగోళ్లు జరపడంతో ఇన్వెస్టర్లనుండి గోల్డ్ డిమాండ్ అధికమైంది. బంగారం మీద పెట్టుబడులు సురక్షితమని మదుపర్లు భావిస్తుండటమే ధర పెరగడానికి కారణంగా ఎనలిస్టులు భావిస్తున్నారు. అందువల్లే బులియన్  మార్కెట్లలో బుల్లిష్ తీరు కనబడుతుందని బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. గత సంవత్సరం మే నెల నుండి బులియన్ మార్కెట్లలో పెట్టుబడులు విస్తారంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లు మందగమనంతో ఉండటం, పలు స్టాక్స్ రేటింగ్స్ పడిపోవడం, ముడి చమురు అస్ధిరత వంటివి ఇన్వెస్టర్లను గోల్డ్ కొనుగోళ్ళకు పురిగొల్పాయి.

Image result for gold biscuits

కామెక్స్ ఇండెక్స్ లో , ఫ్యూచర్స్ లో కూడా ఈ శుక్రవారం నాటికి బంగారం ధర పెరిగి ఒక ఔన్స్ $1,291.70 డాలర్లుగా ఉంది.అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచకపోవడం, మెటల్ రంగంలో మందగమనాలు వంటివి గోల్డ్ స్టాక్స్ ఊపందుకోడానికి దోహద పడ్డాయి. బంగారం మీద పెట్టుబడులు సేఫ్ హెవెన్ బిడ్ల లాంటివని,  తక్కువ నష్టాలు ఉన్న రంగం ప్రస్తుతానికి బులియన్ మార్కెట్లేనని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. 2019లో బంగారం, వెండి వంటి లోహాల మీద ఇన్వెస్ట్‌మెంట్ లాభాలను తీసుకొస్తుందని గోల్డ్ మన్ శాక్స్ పేర్కొంటుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 3,283.5గా ఉంది. ఇది రానున్న వారంలో మరింత పెరగొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. 

Image result for goldman sachs logo
 Most Popular