ఎగసి.. పడినా.. చివరికి లాభాలే!

ఎగసి.. పడినా.. చివరికి లాభాలే!

గడిచిన వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు తొలి మూడు రోజులూ జోరందుకున్నాయి. అయితే చివరి రెండు రోజుల్లోనూ ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో వెనకడుగు వేశాయి. వెరసి శుక్రవారం(11)తో ముగిసిన గత వారం చివరికి మార్కెట్లు లాభాలతో నిలిచాయి. ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ పలుమార్లు ఊగిసలాటకు లోనైనప్పటికీ 36,000 మార్క్‌ ఎగువనే ముగియడం విశేషం. సెన్సెక్స్‌ నికరంగా 315 పాయింట్లు(0.9 శాతం) ఎగసి 36,010 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 68 పాయింట్లు(0.65 శాతం) బలపడి 10,795 వద్ద నిలిచింది.

Related image

టాటా మోటార్స్‌అప్‌
సెన్సెక్స్‌ దిగ్గజాలలో టాటా మోటార్స్‌ 5.6 శాతం జంప్‌చేయగా.. ఐటీ బ్లూచిప్‌ ఇన్ఫోసిస్‌ 3.5 శాతం ఎగసింది. ఇతర కౌంటర్లలో క్యూ3 ఫలితాలు ప్రకటించిన ఇండస్‌ఇండ్‌, టీసీఎస్‌ 2 శాతం చొప్పున డీలాపడ్డాయి. కాగా.. యాక్సిస్‌ బ్యాంక్‌ 7.5 శాతం దూసుకెళ్లింది. ఇన్ఫోసిస్‌ వారాంతాన మార్కెట్లు ముగిశాక పనితీరు వెల్లడించగా.. నవంబర్‌లో ఐఐపీ 0.5 శాతం వృద్ధికి పరిమితమైంది. దీంతో సోమవారం ఈ రెండు అంశాలూ మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Image result for plus and minus

మిడ్‌ క్యాప్స్‌ మిక్స్‌డ్‌
మార్కెట్లు లాభాలతో ముగిసినప్పటికీ బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు నామమాత్ర లాభాలతో నిలిచాయి. అయితే కొన్ని కౌంటర్లు లాభాల ర్యాలీ చేశాయి. వా టెక్‌, హెచ్‌ఎఫ్‌సీఎల్‌, లిండే ఇండియా, కేఆర్‌బీఎల్‌, వక్రంగీ, అదానీ ట్రాన్స్‌, రెప్కో హోమ్‌, ఐసీఐసీఐ ప్రు, చంబల్‌,  సెంచురీ ప్లై, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, అబాట్‌, ముత్తూట్‌, ట్రైడెంట్‌ 20-7 శాతం మధ్య పెరిగాయి. అయితే మరోవైపు గృహ ఫైనాన్స్‌ 24 శాతం కుప్పకూలగా.. ఓరియంట్‌ సిమెంట్‌, చెన్నై పెట్రో, గుజరాత్‌ పిపావవ్‌, లక్ష్మీవిలాస్‌, జేకే లక్ష్మీ, ఇండిగో, టీఐ ఫైనాన్స్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, దివాన్‌ హౌసింగ్‌, బీపీసీఎల్‌, కన్సాయ్‌, హెచ్‌పీసీఎల్‌, ఇండియా సెమ్‌, ఐఐఎఫ్‌ఎంల్‌, పెర్సిస్టెంట్‌ 11-6 శాతం మధ్య తిరోగమించాయి.Most Popular