బిగ్ బజార్‌ నుండి రూ.40కే భోజనం, రూ.10కు  2సమోసాలు.

బిగ్ బజార్‌ నుండి రూ.40కే భోజనం, రూ.10కు  2సమోసాలు.

బిగ్‌బజార్‌ పేరుతో దేశ వ్యాప్తంగా రిటైల్‌ మాల్స్‌ నిర్వహిస్తున్న ఫ్యూచర్‌ గ్రూపు త్వరలో ఫుడ్‌ డెలివరీ వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఆ సంస్థ సీఈఓ కిశోర్‌ బియానీ ఈ విషయం వెల్లడించారు. ఇందు కోసం దేశంలోని ప్రధాన నగరాలు అన్నిటిలో ఫ్యూచర్‌ గ్రూపు త్వరలో క్లౌడ్‌ కిచెన్‌లు ఏర్పాటు చేయబోతోంది. అది కూడా ‘ప్యూచర్‌ పే’ యాప్‌ ద్వారా ఆర్డర్‌ చేసిన వెంటనే మీ ఇంటి దగ్గర డెలివరీ కాబడతాయి. 

Image result for big bazaar future group
 ‘ఇందుకోసం ప్రతి నగరంలో క్లౌడ్‌ కిచెన్‌లు ఏర్పాటు చేస్తాం. వాటి నుంచి తాజా ఆహారాన్ని కస్టమర్లకు సరఫరా చేస్తాం. దీనికి సంబంధించి ముందు ముందు మరింత కార్యాచరణను మీరే చూస్తారు’ అని కిశోర్ బియానీ పేర్కొన్నారు. 
దేశంలోని 38 సమీకృత ఆహార పంపిణీ కేంద్రాలను ఒకే ఛత్రం కిందకి తేవడం ద్వారా ఇండియా ఫుడ్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేసేందుకు ఫ్యూచర్స్‌ సప్లై చెయిన్‌ సొల్యూషన్స్‌ రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తుంది. దీనితో దేశం యావత్తు ఆహార పంపిణీ విభాగం ఒకే గొడుగు కిందకు వస్తుంది. అత్యంత సంక్లిష్టంగా ఉన్న ఆహార, ఎఫ్‌ఎంసీజీ వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టామని ఫ్యూచర్స్‌ గ్రూప్‌ సీఈఓ కిశోర్‌ బియానీ తెలిపారు. దేశంలోని ఏ ఆహార పంపిణీ దారైనా చిన్న, పెద్ద తేడా లేకుండా ఇందులో భాగం కావచ్చునని ఆయన చెప్పారు.

Image result for big bazaar future group
ఈ క్లౌడ్‌ కిచెన్‌ల ద్వారా ముందుగా బియ్యంతో చేసిన భోజనాన్ని అందించాలని ఫ్యూచర్‌ గ్రూపు భావిస్తోంది. అతి త్వరలోనే ఈ క్లౌడ్‌ కిచెన్‌ల ఏర్పాటు ప్రారంభమవుతుందని బియానీ చెప్పారు. ఫ్యూచర్‌ పే యాప్‌ ద్వారా, ఫ్యూచర్‌ గ్రూపు ఈ రెడీ టు ఈట్‌ ఆహార పదార్ధాలు అందించబోతోంది. ‘ముందు బియ్యంతో చేసిన భోజన పదార్ధాలు సిద్ధం చేస్తున్నాం. ఆహార పదార్థాలు వండడం మొదలుకుని డెలివరీ వరకు అంతా మా నెట్‌వర్క్‌ ద్వారానే జరుగుతుంది. దీంతో వినియోగదారులు రూ.10కే రెండు సమోసాలు పొందవచ్చు’ అని బియానీ చెప్పారు. మన దేశ ప్రజలు వినియోగించే అన్ని రకాల ఆహార పదార్ధాలు అందించాలన్నది తమ కోరిక అన్నారు. ఇప్పటి ఫుడ్‌ డెలివరీ రంగంలో విపరీతమైన పోటీ ఉంది. జొమాటో, స్విగ్గీ, ఊబర్‌ ఈట్‌, ఫుడ్‌పాండా వంటి సంస్థలు ప్రధాన నగరాల్లో ఈ సేవలు అందిస్తున్నాయి. ముందు ఖాతాదారులను సంపాదించడమే లక్ష్యంగా ఈ కంపెనీలు నష్టాలకు సిద్ధపడి హోటళ్లు, రెస్టారెంట్ల రుచులను వినియోగదారులకు ఇంటి దగ్గరే డెలివరీ చేస్తున్నాయి.
 ఫుడ్‌ బజార్‌ కోసం ఫ్యూచర్‌ గ్రూపు ఇప్పటికే దేశ వ్యాప్తంగా బియ్యం, పిండి మిల్లులు ఏర్పాటు చేసింది. సొంత బ్రాండ్ల పేరుతో వాటిని విక్రయిస్తోంది. ఈ నెట్‌వర్క్‌ మొత్తాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఫుడ్‌ డెలివరీ వ్యాపారంలో ఉండే, తక్కువ లాభాల సమస్యను అధిగమించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫుడ్‌ డెలివరీ యాప్‌లు స్విగ్గీ, ఊబర్‌ ఈట్‌, జొమాటోలకు తమ ఫుడ్‌ డెలివరీ వ్యాపారం పోటీ కాదని కిశోర్‌ బియానీ చెప్పారు.

Image result for big bazaar future group
 
 

 Most Popular