ఇండియా మార్కెట్లలో విదేశీ ఫండ్ మేనేజర్(Offshore Fund) విక్రయాలు..??

ఇండియా మార్కెట్లలో విదేశీ ఫండ్ మేనేజర్(Offshore Fund) విక్రయాలు..??

సాధారణంగా  సంవత్సరం చివరిలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు యాక్టివ్‌గా ఉండకుండా నిశబ్దంగా ఉంటారు. కానీ ఒక పురాతన విశ్వవిద్యాలయం పేరు పెట్టుకున్న ఓ అఫ్‌షోర్ ఫండ్ సంస్థ మాత్రం దేశీయ మార్కెట్లలో కొన్ని స్టాక్స్ ను విక్రయించి కలకలం రేపుతుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఆఫ్‌షోర్ ఫండ్ మేనేజర్ పేజ్ ఇండస్ట్రీస్, మైండ్ ట్రీ, సుప్రీం ఇండస్ట్రీస్, V-గార్డ్,  కేవల్ కిరణ్ క్లోతింగ్ వంటి స్టాక్స్ ను విక్రయిస్తున్నట్టు..ఎకనామిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది. కాగా ఈ స్టాక్స్ గత వారం వరకూ.. 7 నుండి 9శాతం పడిపోయినవే కావడం గమనార్హం. అయితే.. ఈ విక్రయాలకు కారణాలు మాత్రం తెలియలేదు. బేరిష్ వ్యూతో వీటిని అమ్ముతున్నారా,,లేక  స్కీం మెచ్యూరిటీ కోసం సెల్లింగ్ పెట్టారా అన్నది నిర్ధారణ కాలేదని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. నిన్న మొన్నటి దాకా పడిపోయిన ఈ స్టాక్స్ ను ఆఫ్‌షోర్ ఫండ్ సంస్థ అమ్మడంతో నేటి శుక్ర వారం నాటి మార్కెట్లలో ఈ స్టాక్స్ పుంజుకున్నాయి. దీని వెనుక ఏం మతలబు ఉందో అర్ధం కావడం లేదని ఎకనామిక్ టైమ్స్ పేర్కొనడం ఇక్కడ గమనార్హం.  
నేటి శుక్రవారం పై స్టాక్స్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

కేవల్ కిరణ్ క్లోతింగ్  +0.58శాతం పెరిగి రూ. 1207 గా ఉంది.
V-గార్డ్ ఇండస్ట్రీస్ 0.07శాతం పెరిగి రూ. 206.70 వద్ద ట్రేడ్ అయింది.
పేజ్ ఇండస్ట్రీస్  +0.44శాతం పెరిగి రూ. 23,262.25 వద్ద ట్రేడ్ అయింది. 
మైండ్ ట్రీ లిమిటెడ్ స్టాక్ +2.55 శాతం పెరిగి రూ. 831.90 వద్ద నమోదు అయింది.
సుప్రీం ఇండస్ట్రీస్  +3.20శాతం పెరిగి రూ. 1109.20 వద్ద లిస్ట్ అయింది. 
 Most Popular