నష్టాల ముగింపు- 36,000కు ఎగువనే

నష్టాల ముగింపు- 36,000కు ఎగువనే

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ దేశీయంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో తొలుత హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల బాట పట్టాయి. రోజంతా నేలచూపులతోనే కదిలి చివరికి బలహీనంగానే ముగిశాయి. అయితే ఇంట్రాడేలో సెన్సెక్స్‌ కీలకమైన 36,000 పాయింట్ల మార్క్‌ దిగువనే కదిలినప్పటికీ చివర్లో కొంతమేర కోలుకుంది. వెరసి 97 పాయింట్ల క్షీణతతో 36,010 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 27 పాయింట్లు నీరసించి 10,795 వద్ద స్థిరపడింది. గురువారం వరుసగా ఐదో రోజు అమెరికా మార్కెట్లు లాభపడగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లూ బలపడ్డాయి.

ఎఫ్‌ఎంసీజీ ఎదురీత
ఎన్‌ఎస్ఈలో రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో 1.3-0.8 శాతం మధ్య క్షీణించాయి. ఎఫ్‌ఎంసీజీ మాత్రమే(0.6 శాతం) లాభపడింది. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్, టాటా మోటార్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టీసీఎస్, యస్‌ బ్యాంక్‌, గెయిల్‌, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, అదానీ పో్ర్ట్స్‌ 3.5-1.25 శాతం మధ్య నష్టపోయాయి. అయితే ఐటీసీ, యూపీఎల్‌, విప్రో, ఐవోసీ, హిందాల్కో, ఓఎన్‌జీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, వేదాంతా, హెచ్‌డీఎఫ్‌సీ 1.8-0.5 శాతం మధ్య ఎగశాయి. 

Related image

చిన్న షేర్లు డల్‌
మార్కెట్లు నష్టాలతో ముగియడంతో చిన్న షేర్లూ డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.15 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1420 నష్టపోగా.. 1193 లాభాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు 
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 344 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) నామమాత్రంగా రూ. 11 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 276 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 440 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.Most Popular