లెమన్‌ ట్రీ- రామ్‌ఇన్ఫో జూమ్‌

లెమన్‌ ట్రీ- రామ్‌ఇన్ఫో జూమ్‌

ఆంధ్రప్రదేశ్‌లో హోటల్‌ నిర్వహణకు లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో లెమన్‌ ట్రీ హోటల్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. కాగా.. మరోవైపు ఇతర సంస్థలతో కలసి ఏర్పాటుచేసిన కన్సార్షియం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కాంట్రాక్టును పొందిన వార్తలతో రామ్‌ఇన్ఫో లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. నష్టాల మార్కెట్లోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో ట్రేడవుతున్నాయి. వివరాలు చూద్దాం...

లెమన్‌ ట్రీ హోటల్స్‌
ఆంధ్రప్రదేశ్‌లోని దిండీలోని 50 గదుల రిసార్ట్‌ నిర్వహణకు లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు లెమన్‌ ట్రీ హోటల్స్‌ తాజాగా పేర్కొంది. లెమన్‌ ట్రీ ప్రీమియర్‌ బ్రాండుతో ఈ రిసార్ట్‌ నిర్వహణ చేపట్టనున్నట్లు తెలియజేసింది. 2021 మార్చికల్లా హోటల్‌ ప్రారంభంకానున్నట్లు అంచనా వేస్తోంది. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం కార్నేషన్‌ హోటల్స్‌ నిర్వహణను చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో లెమన్‌ ట్రీ షేరు 2.3 శాతం పెరిగి రూ. 72 వద్ద ట్రేడవుతోంది. లెమన్‌ ట్రీ హోటల్స్‌లో ప్రమోటర్లకు 30.84 శాతం వాటా ఉంది.

Image result for raminfo limited

రామ్‌ఇన్ఫో లిమిటెడ్‌
ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య, ఔషధ, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ఆర్డర్‌ను గెలుచుకున్నట్లు రామ్‌ఇన్ఫో లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. రెండు ఇతర సంస్థలతో కలసి ఏర్పాటు చేసిన కన్సార్షియం ద్వారా రూ. 400 కోట్ల విలువైన ప్రాజెక్టును సంపాదించినట్లు తెలియజేసింది. కాంట్రాక్టులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలోగల ఉపకేంద్రాల వద్ద టెలిమెడిసిన్‌ సౌకర్యాలను ప్రామాణికరించవలసి(స్టాండర్‌డైజేషన్‌) ఉంటుందని వివరించింది. తొలి దశలో భాగంగా ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ టర్నొవర్‌ రూ. 400 కోట్లవరకూ ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో రామ్‌ఇన్ఫో షేరు ప్రస్తుతం 7.2 శాతం జంప్‌చేసి రూ. 41 వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో ప్రమోటర్లకు 33.41 శాతం వాటా ఉంది. Most Popular