బ్రోకరేజ్ సంస్థలను ఆకట్టుకోని TCS క్వార్టర్ ఫలితాలు..? 

బ్రోకరేజ్ సంస్థలను ఆకట్టుకోని TCS క్వార్టర్ ఫలితాలు..? 

TCS క్వార్టర్ 3 ఫలితాలు మార్కెట్ ఎనలిస్టులను ఆకట్టుకున్నాయి.  కంపెనీకి దక్కిన బలమైన విజయాలు, స్థిరంగా పెరుగుతున్న డిజిటల్ వ్యాపారం, బలహీనంగా ఉన్న ఆర్ధిక వ్యవస్థలో మెరుగైన పనితీరు వంటివి విశ్లేషకులను ఆకట్టకున్నాయనే చెప్పొచ్చు. కానీ.. వరుసగా బలహీన మార్జిన్లు, అధిక ఉప కాంట్రాక్టింగ్ వ్యయాలు, IT సెక్టార్‌లో ఉన్న మందగమనం వంటివి TCS కంపెనీ ముందున్న అతిపెద్ద సవాళ్ళుగా కనిపిస్తున్నాయి. TCS ప్రకటించిన మూడో త్రైమాసిక ఫలితాల్లో మార్జిన్ల శాతం 26-28 శాతం నమోదు మార్కెట్ అనలిస్టులకు అంతుచిక్కకుండా ఉంది.  అమెరికా మార్కెట్ల ఆర్ధిక మందగమనం ముందు ముందు కంపెనీ లాభాలపై ప్రభావం చూపవచ్చు, మరియు దాని రెవెన్యూ గ్రోత్‌కు అవరోధంగా మారొచ్చని బ్రోకరేజ్ సంస్థలు  భావిస్తున్నాయి.

Image result for TCS

టాటా గ్రూప్‌ సంస్థల్లోనే ఎక్కువ లాభాల్నినమోదు చేసే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS) ఈ త్రైమాసికానికి ఆదాయంలో 20.8 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. గతేడాదిలోని రూ.30,904 కోట్ల నుంచి ఆదాయం రూ.37,338 కోట్లకు పెరిగింది. కరెన్సీ ఆధారంగా ఆదాయ వృద్ధి 12.1 శాతంగా ఉంది. గత 14 త్రైమాసికాల్లో ఇదే అత్యధిక వృద్ధి రేటని సంస్థ సీఈవో, ఎండీ రాజేశ్‌ గోపీనాథన్‌ వెల్లడించారు. ఈ TCS Q-3 రిజల్ట్ మార్జిన్లు, కంపెనీ వాఖ్యలను సునిశితంగా పరిశీలిస్తే.. రాబోయే కాలంలో కంపెనీ లాభాల్లో కత్తిరింపులు ఉండబోతున్నట్టు అనిపిసతుందని, ఇతర పోటీ సంస్థల మార్జిన్లకు , టాటా కన్సల్టెన్సీ మార్జిన్లకు వ్యతాసం భారీగానే ఉండొచ్చని ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓశ్వాల్ అభిప్రాయపడింది. 

Image result for TCS Q-3
ప్రస్తుత Q-3 ఫలితాలు రాబోయే రోజుల్లో కంపెనీ పనితీరు ఎలా ఉండబోతుందో అన్నదానికి సంకేతంలా కనబడతుందని నిర్మల్ బ్యాంగ్ ఇన్స్టిట్యూషన్ రీసెర్చ్ సంస్థ పేర్కొంది. రాబోయే త్రైమాసికాల్లో కంపెనీ పనితీరు ఈ బెంచ్ మార్క్ ను దాటబోదని నిర్మల్ సంస్థ భావిస్తోంది. అంతే కాకుండా కంపెనీ స్టాక్స్ కూడా పెరగడం కష్టం కావొచ్చని నిర్మల్ రీసెర్చ్ పేర్కొంది.  TCS కంపెనీ సబ్ కాంట్రాక్టర్స్ వ్యయం దాదాపు 60 బేసిస్ పాయింట్లు పెరిగడం, సేల్స్ శాతం కూడా కేవలం 7.6శాతం మాత్రమే పెరగడం ఇక్కడ గమనార్హం. ఇప్పటికే కంపెనీ త్రైమాసిక ఫలితాల అనంతరం నేటి శుక్రవారపు మార్కెట్లలో TCS స్టాక్ ధర -2.42శాతం నష్టపోయి రూ. 1,842.90 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు , ఫండ్ మేనేజర్లు ఈ TCS స్టాక్‌కు టార్గెట్ ప్రైస్‌ రూ. 1,645 గా పేర్కొంటున్నారు.

Image result for TCS Q-3
రూపీ మారకపు విలువ 2019 కాస్త బలపడితే.. IT సెక్టార్ మందగించవచ్చని ఎనలిస్టుల అభిప్రాయం. అంతేకాకుండా అమెరికన్ ఆర్ధిక వ్యవస్థ షట్ డౌన్స్, ఫెడ్ వడ్డీ రెట్లు తగ్గింపు వంటివి IT పరిశ్రమలను ప్రభావితం చెయొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడి, మార్కెట్లు స్థిరీకృతం అయితే.. రూపీ ఖచ్చితంగా బలపడుతుంది. దీంతో TCS వంటి కంపెనీల మార్జిన్లు తగ్గొచ్చని బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ స్టాక్స్ కనుక రాణిస్తే.. లార్జ్ క్యాప్ సెక్టార్ ఒత్తిళ్ళను ఎదర్కొక తప్పదని వారు అంచనా వేస్తున్నారు. 
 Most Popular