కర్ణాటక బ్యాంక్‌ గుడ్‌- బీవోఐ వీక్‌

కర్ణాటక బ్యాంక్‌ గుడ్‌- బీవోఐ వీక్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో ప్రయివేట్‌ రంగ సంస్థ కర్ణాటక బ్యాంక్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. దీంతో నష్టాల మార్కెట్లోనూ ఈ షేరు ఎదురీదుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో కర్ణాటక బ్యాంక్‌ షేరు 1.4 శాతం పెరిగి రూ. 117 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 114 వద్ద కనిష్టాన్ని తాకింది. కాగా.. మరోవైపు ఇసాప్‌(ESOP) కింద ఉద్యోగులకు షేర్ల కేటాయింపును చేపట్టనున్నట్లు వెల్లడించడంతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కౌంటర్‌ బలహీనపడింది. వివరాలు చూద్దాం...

క్యూ3 ఇలా
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో కర్ణాటక బ్యాంక్‌ నికర లాభం రూ. 87 కోట్ల నుంచి రూ. 140 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 8 శాతం పెరిగి రూ. 488 కోట్లను తాకింది. డిసెంబర్‌కల్లా కనీస పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్‌) 11.98 శాతంగా నమోదైంది. కాగా.. త్రైమాసిక ప్రాతిపదికన  ప్రొవిజన్లు రూ. 196 కోట్ల నుంచి రూ. 209 కోట్లకు పెరిగాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.66 శాతం నుంచి 4.45 శాతానికి నీరసించగా.. నికర ఎన్‌పీఏలు 3 శాతంవద్దే నిలకడను చూపాయి. 

Image result for bank of india

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
అర్హతగల ఉద్యోగులకు ఈక్విటీ షేర్లను కేటాయించేందుకు బోర్డు అనుమతించినట్లు పీఎస్‌యూ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా తెలియజేసింది. షేరుకి రూ. 80 ధరలో 10 కోట్ల వరకూ ఈక్విటీ షేర్లను సిబ్బందికి జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో ఈ షేరు 2.3 శాతం క్షీణించి రూ. 104 దిగువన ట్రేడవుతోంది. Most Popular