2019లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్‌ల నుండి మార్జిన్లు..! కాని షరతులు వర్తిస్తాయి..!

2019లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్‌ల నుండి మార్జిన్లు..! కాని షరతులు వర్తిస్తాయి..!

మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ రంగాలు 2018లో మదుపర్లకు తీవ్ర నష్టాలనే మిగిల్చాయి. అయినప్పటికీ.. బ్రోకరేజ్ సంస్థల వారు ఈ 2019 సంవత్సరం మాత్రం అవి లాభాలను తీసుకొస్తాయని అంటున్నారు. దీనికి వారు చరిత్రను సాక్ష్యంగా చూపిస్తున్నారు. 2005 ఏప్రిల్‌లో BSE మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెక్టార్లను ప్రవేశ పెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా.. ఈ 13 ఏళ్ళ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ పడినప్పుడల్లా.. ఆ తరువాతి సంవత్సరం అవి రెట్టింపు వేగంతో పైకి ఎగిసాయి. ప్రస్తుతం ఎనలిస్టులు కూడా ఇదే చెబుతున్నారు. 2018 ఈ రెండు రంగాలు నష్టాల పాలైనప్పటికీ.. ఈ2019 సంవత్సరంలో అవి ఖచ్చితంగా పుంజుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 2013 సంవత్సరంలో స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ రంగాలు పూర్తిగా నష్టపోయాయి. ఆ మరుసటి ఏడాది 2014లో ఈ రెండూ పుంజుకుని మదుపర్లకు లాభాలను ఆర్జించి పెట్టాయి. ఆ ఏడాది స్మాల్, మిడ్ క్యాప్ రంగాలు 54.7-69.2శాతం ర్యాలీని చేశాయి. 2014లో BSE ఇండెక్స్ 29.9శాతం వృద్ధిని కనబరిచింది. 2013లో ఈ రెండు రంగాలు దాదాపు 6-11.2 శాతం నష్టపోయాయి. 2012లో స్మాల్ , మిడ్ క్యాప్ రంగాలు గణనీయంగా లాభాలను తెచ్చిపెట్టడమే కాకుండా... దాదాపు 38శాతం వృద్ధిని అవి నమోదు చేశాయి.  ఈ 13 సంవత్సరాల చరిత్రలో కేవలం 2010, 2011 సంవత్సరాలు మాత్రమే వరసగా సెన్సెక్స్ ను నిరాశ పరిచాయని చెప్పొచ్చు.

Tableee

Courtesy: Economic Times

ఇక 2009లో ఈ సెక్టార్లు దాదాపు 127శాతం వృద్ధిని కనబరిచాయి. ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేశాయి. 2008లో గ్లోబల్ ఆర్ధిక సంక్షోభాలు, మార్కెట్లు నెమ్మదించడంతో ఓవరాల్ ఇండెక్స్‌లు నష్టాలనే నమోదు చేశాయి. ఈ చరిత్రను దృష్టిలో పెట్టుకునే ఎనలిస్టులు, ప్రముఖ ఫండ్ మేనేజర్లు ఈ సంవత్సరం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగాలు ఆకర్షణీయంగా మారొచ్చని అంచనా వేస్తున్నారు. 

Image result for small cap and mid cap
2019 సంవత్సరం తొలి వారంలో నిన్నటి గురువారం నాటికి ఈ రంగాలు 2శాతం నష్టపోయినా.. రానున్న రోజుల్లో ఇవి ఆశాజనకంగా మారుతాయని వారు అంచనా వేస్తున్నారు. ఒక వేళ ఈ సంవత్సరం మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పటికీ.. ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోలో 40-60 నిష్పత్తి చొప్పున లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఎంపిక చేసుకోడం ఉత్తమమని ఎనలిస్టులు సూచిస్తున్నారు. 50 నుండి 60శాతం లార్జ్ క్యాప్ స్టాక్స్ , 40 శాతం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ను ఎంచుకోవడం బెస్ట్ ఛాయిస్ అని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు సూచిస్తున్నాయి. 
 Most Popular