అమ్మకాల ఊపు- ఎఫ్‌ఎంసీజీ ఓకే

అమ్మకాల ఊపు- ఎఫ్‌ఎంసీజీ ఓకే

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ నష్టాల బాట పట్టిన దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు మరింత పెరిగాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 253 పాయింట్లు క్షీణించి 35,853ను తాకింది. తద్వారా 36,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. నిఫ్టీ సైతం 74 పాయింట్లు నీరసించి 10,747 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్ఈలో రియల్టీ, ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా 1.3-0.6 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎఫ్‌ఎంసీజీ మాత్రమే(0.4 శాతం) పుంజుకుంది.  

దిగ్గజాలు డీలా
నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, టీసీఎస్, ఇండస్‌ఇండ్, ఇన్‌ఫ్రాటెల్‌, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌, ఎంఅండ్ఎం, ఆర్‌ఐఎల్‌,  గెయిల్‌, మారుతీ 3-1.25 శాతం మధ్య నష్టపోయాయి. అయితే ఐటీసీ, యూపీఎల్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ, ఐవోసీ, వేదాంతా, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ 1.4-0.4 శాతం మధ్య బలపడ్డాయి. 

డెరివేటివ్స్‌ తీరిలా
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఇండిగో, శ్రీ సిమెంట్‌, శ్రేఈ ఇన్‌ఫ్రా, గ్లెన్‌మార్క్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, సుజ్లాన్‌, బీవోబీ 3.7-2.7 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా మరోవైపు సీఈఎస్‌సీ, రెప్కో హోమ్‌, ఐసీఐసీఐ ప్రు, గాడ్‌ఫ్రే ఫిలిప్, టొరంట్‌ ఫార్మా, జెట్‌ ఎయిర్‌వేస్‌, పెట్రోనెట్‌, ఆర్‌ఈసీ 3-1 శాతం మధ్య ఎగశాయి. 

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు లాభాల నుంచి నష్టాలలోకి ప్రవేశించిన నేపథ్యంలో చిన్న షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4 శాతం చొప్పున డీలాపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1424 నష్టపోగా.. 980 మాత్రమే లాభాలతో ట్రేడవుతున్నాయి.