భారీ ట్రేడింగ్‌- షేర్లు జూమ్‌! 

భారీ ట్రేడింగ్‌- షేర్లు జూమ్‌! 

నష్టాల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్న మార్కెట్లలో కొన్ని కౌంటర్లు అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లను భారీగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ కౌంటర్లలో ట్రేడింగ్‌ జోరుగా సాగుతోంది. వీటిలో విదేశాలకు బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసే కేఆర్‌బీఎల్‌ లిమిటెడ్‌, దేశీ ఫార్మా కంపెనీ క్యాప్లిన్‌ పాయింట్‌ లేబొరేటరీస్‌ నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. మిగిలిన కౌంటర్లలో లావాదేవీలు ఊపందుకున్నప్పటికీ అటూఇటుగా ట్రేడవుతున్నాయి. వివరాలు చూద్దాం.. 

కేఆర్‌బీఎల్‌ లిమిటెడ్‌: ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన కేఆర్‌బీఎల్‌ కౌంటర్లో భారీ ట్రేడింగ్‌ జరుగుతోంది. గత 20 రోజుల సగటు పరిమాణంతో పోలిస్తే ఇప్పటివరకూ 30 రెట్లు అధికంగా ట్రేడింగ్‌ నమోదైంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం కేఆర్‌బీఎల్‌ షేరు 11 శాతంపైగా దూసుకెళ్లి రూ. 325 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 331 వద్ద గరిష్టాన్నీ, రూ. 298 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. 

ఏఐఏ ఇంజినీరింగ్‌: గుజరాత్‌ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన ఏఐఏ ఇంజినీరింగ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 0.8 శాతం బలహీనపడి రూ. 1658 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1680-1646 మధ్య ఊగిసలాడింది. గత 20 రోజుల సగటుతో పోలిస్తే ఇప్పటివరకూ ఈ కౌంటర్లో ఏకంగా 20 రెట్లు అధికంగా ట్రేడింగ్‌ పరిమాణం నమోదైంది.

క్యాప్లిన్‌ పాయింట్‌: చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన క్యాప్లిన్‌ పాయింట్‌ లేబ్‌ కౌంటర్‌లో లావాదేవీలు ఊపందుకున్నాయి. గత 20 రోజుల సగటుతో పోలిస్తే ఇప్పటివరకూ 20 రెట్లు అధికంగా ట్రేడింగ్‌ పరిమాణం నమోదైంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 411 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 418 వద్ద గరిష్టాన్ని, రూ. 381 వద్ద కనిష్టాన్నీ తాకింది.

లారస్‌ లేబ్స్‌ లిమిటెడ్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన లారస్‌ లేబ్స్‌ లిమిటెడ్‌ కౌంటర్లో ట్రేడింగ్‌ జోరందుకుంది. గత 20 రోజుల సగటుతో పోలిస్తే ఇప్పటివరకూ 8 రెట్లు అధికంగా షేర్లు చేతులు మారాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 0.6 శాతం నష్టంతో రూ. 376 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 376 వద్ద గరిష్టాన్ని తాకింది.Most Popular