సీబీజీతో ప్రాజ్‌ ఇండస్ట్రీస్‌ పరుగు

సీబీజీతో ప్రాజ్‌ ఇండస్ట్రీస్‌ పరుగు

కంప్రెస్‌డ్‌ బయోగ్యాస్‌(సీబీజీ)పై సమీకృత ప్లాంటును విశ్లేషణాత్మకంగా ఆవిష్కరించడంతో ప్రాజ్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. తద్వారా సీబీజీ టెక్నాలజీను వాణిజ్యపరంగా అభివృద్ధిచేయడంపై రోడ్‌మ్యాప్‌ను విడుదల చేసింది. దీంతో ఆధునిక టెక్నాలజీ, డిజైన్ల ద్వారా వివిధ సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కంపెనీ సమకూర్చుకున్నట్లయ్యింది. 

దేశీయంగా తొలిసారి
దేశీయంగా సమీకృత సీబీజీ ప్లాంట్‌ డెమోను ప్రాజ్‌ ఇండస్ట్రీస్‌ తొలిసారిగా ఆవిష్కరించినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. బయోమాస్‌, ప్రెస్‌ మడ్‌, అగ్రి, పేపర్‌ మిల్‌ వేస్ట్‌ తదితరాలతో సీబీజీ తయారీకి వీలయ్యే మెరుగైన ప్లాంట్లను కంపెనీ రూపొందించగలదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రాజ్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌వైపు ఇన్వెస్టర్లు దృష్టిసారించారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.4 శాతం జంప్‌చేసి రూ. 145 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 148 సమీపంలో 52 వారాల గరిష్టానికి చేరింది. బయో ఇంధనం, బ్రూవరీ, వేస్ట్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ తదితర సొల్యూషన్స్ అందించే కంపెనీలో ప్రమోటర్లకు ప్రస్తుతం 33.23 శాతం వాటా ఉంది.Most Popular