టీసీఎస్‌ క్యూ3 ఎఫెక్ట్- ఐటీ వీక్‌

టీసీఎస్‌ క్యూ3 ఎఫెక్ట్- ఐటీ వీక్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం టీసీఎస్‌ పటిష్ట ఫలితాలు ప్రకటించింది. అయితే విశ్లేషకుల అంచనాలను ఇవి మించకపోవడంతో టీసీఎస్ కౌంటర్‌బలహీనపడింది. దీంతో ఇతర ఐటీ కౌంటర్లు సైతం నేలచూపులతో కదులుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టీసీఎస్‌ షేరు 2.2 శాతం క్షీణించి రూ. 1847 దిగువన ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1875-1837 మధ్య ఊగిసలాడింది. ఇతర ఐటీ షేర్లలో మైండ్‌ట్రీ, టాటా ఎలక్సీ, హెచ్‌సీఎల్‌ టెక్, ఎన్‌ఐఐటీ టెక్ 2-0.7 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

Image result for IT employees india

ఫలితాలు ఓకే
క్యూ3(అక్టొబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం రూ. 6531 కోట్ల నుంచి రూ. 8105 కోట్లకు ఎగసింది. ఈ బాటలో మొత్తం ఆదాయం సైతం రూ. 30,904 కోట్ల నుంచి రూ. 37,338 కోట్లకు పెరిగింది. డాలర్ల రూపేణా ఆదాయం 479 కోట్ల డాలర్ల నుంచి 525 కోట్ల డాలర్లకు పుంజుకుంది. ఇక నిర్వహణ లాభం రూ. 7781 కోట్ల నుంచి రూ. 9564 కోట్లకు జంప్‌చేసింది. అయితే ఇబిటా మార్జిన్లు 25.6 శాతం నుంచి 25.2 శాతానికి నీరసించాయి. కరెన్సీ హెచ్చుతగ్గులు, వీసా నియంత్రణల కారణంగా సరఫరా సమస్యలు తదితరాలు మార్జిన్లపై ప్రభావాన్ని చూపినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వార్షిక ప్రాతిపదికన నికర లాభం 24 శాతం, ఆదాయం 21 శాతం చొప్పున జంప్‌చేయగా.. త్రైమాసిక ప్రాతిపదికన 2.5 శాతం స్థాయిలో పెరిగాయి. కాగా.. ఏఐ, ఐవోటీ, డిజిటల్‌, ఇంటెలిజెంట్‌ ఆటోమేషన్‌ తదితర విభాగాలలో భవిష్యత్‌లోనూ మరిన్ని డీల్స్‌ కుదుర్చుకోగమంటూ టీసీఎస్ యాజమాన్యం ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. Most Popular