లాభాలతో షురూ- ఐటీ నేలచూపు

లాభాలతో షురూ- ఐటీ నేలచూపు

హెచ్చుతగ్గులు చవిచూసినప్పటికీ వరుసగా ఐదో రోజు అమెరికా స్టాక్ మార్కెట్లు లాభపడిన నేపథ్యంలో దేశీయంగా సెంటిమెంటు బలపడింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 76 పాయింట్లు పుంజుకుని 36,182కు చేరగా.. నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 10,844 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు పరిష్కారమయ్యే సంకేతాల నేపథ్యంలో గురువారం యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో అన్ని మార్కెట్లూ కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి.  

Image result for IT employees india

రియల్టీ డౌన్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 0.5 శాతం లాభపడగా.. ఐటీ 0.8 శాతం, రియల్టీ 0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ, ఐటీసీ, హిందాల్కో, గ్రాసిమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బీపీసీఎల్‌, ఐవోసీ, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌ 1-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. బ్లూచిప్స్‌లో టీసీఎస్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్, ఇన్‌ఫ్రాటెల్‌, ఎంఅండ్ఎం, ఎల్‌అండ్‌టీ, ఐషర్‌, టెక్‌ మహీంద్రా, గెయిల్‌, విప్రో 1.5-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. రియల్టీ స్టాక్స్‌లో శోభా, యూనిటెక్‌, ఒబెరాయ్‌, డీఎల్‌ఎఫ్‌, ఇండియాబుల్స్‌, ప్రెస్టేజ్‌ 3-0.5 శాతం మధ్య పెరిగాయి. 

డెరివేటివ్స్‌ తీరిలా
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో రెప్కో హోమ్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, ఎన్‌ఎండీసీ 2-1 శాతం మధ్య ఎగశాయి. కాగా మరోవైపు హెక్సావేర్‌, మైండ్‌ట్రీ, ఇండిగో, శ్రీ సిమెంట్‌, అరబిందో, జీఎంఆర్‌ 2.3-1 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు లాభాలతో ప్రారంభమైన నేపథ్యంలో చిన్న షేర్లకు డిమాండ్‌ పుట్టింది. బీఎస్ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 708 లాభపడగా.. 443 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి.Most Popular