సానుకూల ఓపెనింగ్‌ నేడు?!

సానుకూల ఓపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 29 పాయింట్లు బలపడి 10,890 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. గురువారం వరుసగా ఐదో రోజు అమెరికా స్టాక్‌ మార్కెట్లు 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. అయితే యూరోపియన్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఇక ప్రస్తుతం ఆసియాలో ఇన్ని మార్కెట్లూ లాభాలతో కదులుతున్నాయి. దీంతో నేడు దేశీయంగానూ మార్కెట్లు సానుకూలంగా కదిలే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

36000కు పైనే
గురువారం నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం చివరివరకూ బలహీనంగానే కదిలాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో ఏ దశలోనూ కోలుకున్నట్లు కనిపించలేదు. వెరసి ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 106 పాయింట్లు క్షీణించి 36,107 వద్ద నిలవగా.. నిఫ్టీ 34 పాయింట్లు బలహీనపడి 10,822 వద్ద స్థిరపడింది.

Image result for nse

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 10,796 పాయింట్ల వద్ద, తదుపరి 10,770 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 10,853 పాయింట్ల వద్ద, తదుపరి 10,885 స్థాయిలోనూ అవరోధాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 27,440 వద్ద, తదుపరి 27,351 వద్ద సపోర్ట్‌ కనిపించవచ్చని... మరోవైపు 27665, 27802 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు.
   
రెండువైపులా కొనుగోళ్లు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 344 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) నామమాత్రంగా రూ. 11 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 276 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 440 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.Most Popular