2019లో ఈ 25  మిడ్ క్యాప్  స్టాక్స్‌ను చూడొచ్చు..!

2019లో ఈ 25  మిడ్ క్యాప్  స్టాక్స్‌ను చూడొచ్చు..!

2018లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ కొని చేతులు కాల్చుకున్న మదుపర్లు వాటి వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడుతున్నారు. S&P BSE సెన్సెక్స్ 2018లో 6శాతం పెరగగా, అదే సమయంలో BSE మిడ్ క్యాప్ సెన్సెక్స్ 13శాతం పడిపోయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 23శాతం పడిపోయింది.

Karvy Midcap

2018 లో మిడ్ క్యాప్ కంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా లాభాలను తీసుకు వచ్చా యి. BSE ఇండెక్స్ లోని లార్జ్ క్యాప్స్ లో దాదాపు 34 శాతం స్టాక్స్ లాభాలను తీసుకొచ్చాయి. ప్రముఖ బ్రోకరేజ్ నిపుణులు, ఎనలిస్టులు మాత్రం 2019లో మిడ్ క్యాప్ స్టాక్స్ రాణిస్తాయని అంచనా వేస్తున్నారు. వాల్యూయేషన్ సౌకర్యం, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం,  మార్జిన్ల గ్రోత్  వంటి కారణాలతో ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ వృద్ధిని సాధించవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోల్లో 40శాతం మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ స్టాక్స్ కు కేటాయిస్తే.. సంవత్సర కాలంలో ఆ పోర్ట్ ఫోలియో విజయవంతం అవుతుందని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొంటున్నాయి. 40శాతం స్మాల్ ,మిడ్ క్యాప్ స్టాక్స్, మిగతా 60శాతం లార్జ్ క్యాప్ స్టాక్స్ మీద పెట్టుబడులు లాభదాయకమని రిలయన్స్ సెక్యూరిటీస్ తెలిపింది.  ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు మిడ్ క్యాప్ రంగంలో ఓ 25 స్టాక్స్ ను 2019 సంవత్సరం కోసం మంచి ఎంపికగా పేర్కొంటున్నాయి. అవేంటో చూద్దామా..!
కార్వే స్టాక్ బ్రోకింగ్ సంస్థ  సూచించిన ప్రకారం ఈ 10 స్టాక్స్ విలువైన పెట్టుబడులుగా భావిస్తుంది
బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఫినోలెక్స్ కేబుల్స్, జైన్ ఇరిగేషన్, KPR మిల్స్ , రిలాక్సో ఫుట్ వేర్, సన్ టెక్ రియాల్టీ, టేక్ సొల్యూషన్స్ వంటి స్టాక్స్ ను ఎంపిక చేసుకోడం బెటర్ అని కార్వే సంస్థ పేర్కొంది.
కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ సంస్థ అంచనా ప్రకారం ఈ కింది 15 స్టాక్స్ మంచి పనితీరును కనబరుస్తాయని అంచనా వేస్తుంది. వాటిలో
శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్, పెట్రోనెట్ LNG, మైండ్ ట్రీ, లారస్ ల్యాబ్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, ఫెడరల్ బ్యాంక్,  ఈక్విటాస్ హోల్డింగ్స్ , ఎస్కార్ట్స్ వంటి మిడ్ క్యాప్ స్టాక్స్ ఎంపిక ఉత్తమమని కొటక్ పేర్కొంటుంది. 

Kotak Midcap portfolio


Disclaimer: పైన సూచించిన సలహాలు, సూచనలు ప్రముఖ బ్రోకింగ్ కంపెనీలు, ఎనలిస్టులు ఇచ్చినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి. 
 

 Most Popular