బేవరేజెస్ రంగంలో కిక్కిచ్చిన  రాడికో ఖైతాన్ ..!

బేవరేజెస్ రంగంలో కిక్కిచ్చిన  రాడికో ఖైతాన్ ..!

గత సంవత్సరం మార్కెట్లో బ్రూవరీస్ కంపెనీల స్టాక్స్ గణనీయంగా పడిపోయాయి. వీటన్నిటికి అతీతంగా ఒక్క రాడికో ఖైతాన్ మాత్రం 25శాతం జంప్ చేసి S&P BSE ఇండెక్స్ బెంచ్ మార్క్‌లలో 4.97శాతం  వృద్ధిని కనబరిచింది. ఇదే సమయంలో మిగతా బ్రూవరీస్ అయిన యునైటెడ్ స్పిరిట్, పిన్ కాన్ స్పిరిట్ , GM బ్రూవరీస్ 6-40 శాతం నష్టపోయాయి. 

Why Radico Khaitan Surged When Other Liquor Makers Tumbled
రాడికో ఖైతాన్ 3 కొత్త ప్రీమియమ్ బ్రాండ్లను మార్కెట్లో విడుదల చేసింది. 8PM బ్లాక్ విస్కీ, మార్ఫియస్ బ్లాక్ బ్రాందీ, జైసల్మేర్ ఇండియన్ క్రాఫ్ట్ జిన్‌లను మార్కెట్లో విడుదల చేసింది. వీటికి క్రమంగా ఆదరణ దక్కడంతో కంపెనీ మార్జిన్ల సూచీలు ఎగబాకాయి. ఈ బ్రాండ్ల అమ్మకాల ద్వారా కంపెనీ డబుల్ డిజిట్ గ్రోత్ వాల్యూమ్‌ను సాధించింది. వీటితో పాటు మిగతా బ్రాండ్ల అమ్మకాలతో ఓవరాల్ రెవెన్యూ 300 బేసిస్ పాయింట్ల వరకూ పెరిగింది. 2017-18లో బేసిస్ పాయింట్ల పెరుగుదల శాతం 26శాతంగా ఉండగా, 2018-19 తొలి అర్ధభాగం కల్లా అది 29శాతం పెరుగుదలను సాధించింది.

Image result for radico khaitan

అంతే కాకుండా ఉత్తర ప్రదేశ్‌ లోని కొత్త ఎక్సైజ్ పాలసీ కూడా కంపెనీకి కలిసొచ్చిన అంశం. టెండర్ ప్రక్రియ, కార్టిలైజేషన్ , డిజిటలైజేషన్ వంటి వాటిలో రాష్ట్రప్రభుత్వం నిబంధనలను సరళీకరించడంతో రాడికో ఖైతాన్ మార్జిన్లు పెరిగాయని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దిలీప్ బాంతియా పేర్కొన్నారు. 

Why Radico Khaitan Surged When Other Liquor Makers Tumbled
గత రెండు సంవత్సరాలుగా లిక్కర్ కంపెనీలకు దేశీయంగా పలు అవాంతరాలు ఎదురయ్యాయి. నోట్ల రద్దు, రాష్ట్రాల పరంగా మద్యరహిత పాలసీలు, ప్రొహిబిషన్, నేషనల్ హైవేల సమీపంలో మద్యం అమ్మకాల నిషేధం , GST వంటి కారణాల చేత లిక్కర్ కంపెనీలు నష్టాల బాటలోనే కొనసాగాయి. అయినప్పటికీ.. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా రాడికో తన రుణ భారాన్ని చాలావరకూ తగ్గించుకోగలిగింది. కంపెనీ రుణ భారం రూ. 380కోట్లు ఉండగా అందులో 50శాతం రుణాలను చెల్లించివేసింది రాడికో.  2019లో రాడికో ఖైతాన్ స్టాక్స్ కు బై రేటింగ్స్ లభించడమే కాకుండా బెస్ట్ పెర్పార్మెన్స్ రేటింగ్స్ కూడా దక్కాయి. పలు ఎసెట్ మేనేజర్లు కూడా ఈ స్టాక్స్ మీద అమితాసక్తి ప్రదర్శిస్తుండటం గమనార్హం. 
 Most Popular